ఇటీవల ఎన్నికల షెడ్యూల్( Election Schedule ) ప్రకటనతో ఏపీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.దీంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచారు.
ఆదివారం టీడీపీ – బీజేపీ – జనసేన పార్టీలు “ప్రజా గళం”( Praja Galam ) పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.ఈ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు.
ఇదిలా ఉండగా వైసీపీ అధినేత వైయస్ జగన్( YS Jagan ) రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పర్యటనలకు రెడీ అవుతున్నారు.ఈనెల 27 నుంచి దాదాపు 20 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించడానికి సిద్ధం కావటం జరిగింది.
ఈ పర్యటనలకు ముందు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో నేడు సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బస్సు యాత్ర, రూట్ మ్యాప్, మేనిఫెస్టో వంటి తదితర అంశాలపై చర్చించడం జరిగింది.అంతేకాదు మూడు పార్టీలకు ఓటమిని ఎదుర్కొనే కార్యచరణ పార్టీ నేతలకు సీఎం జగన్ దిశ నిర్దేశం చేశారు.అంతేకాదు అభ్యర్థులకు సరిపడా సమయం ఉందన్నారు.
ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి ప్రతి సచివాలయాన్ని సందర్శించాలి.ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని సూచించారు.“సిద్ధం” సభలు( Siddham Meetings ) తరహాలోనే బస్సు యాత్ర కూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.