CM Jagan : ఎన్నికలలో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు సీఎం జగన్ కీలక సూచనలు..!!
TeluguStop.com
ఇటీవల ఎన్నికల షెడ్యూల్( Election Schedule ) ప్రకటనతో ఏపీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
దీంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచారు.ఆదివారం టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీలు "ప్రజా గళం"( Praja Galam ) పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.
ఈ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు.ఇదిలా ఉండగా వైసీపీ అధినేత వైయస్ జగన్( YS Jagan ) రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పర్యటనలకు రెడీ అవుతున్నారు.
ఈనెల 27 నుంచి దాదాపు 20 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించడానికి సిద్ధం కావటం జరిగింది.
ఈ పర్యటనలకు ముందు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో నేడు సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు.
"""/" /
ఈ సమావేశంలో బస్సు యాత్ర, రూట్ మ్యాప్, మేనిఫెస్టో వంటి తదితర అంశాలపై చర్చించడం జరిగింది.
అంతేకాదు మూడు పార్టీలకు ఓటమిని ఎదుర్కొనే కార్యచరణ పార్టీ నేతలకు సీఎం జగన్ దిశ నిర్దేశం చేశారు.
అంతేకాదు అభ్యర్థులకు సరిపడా సమయం ఉందన్నారు.ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి ప్రతి సచివాలయాన్ని సందర్శించాలి.ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని సూచించారు.
"సిద్ధం" సభలు( Siddham Meetings ) తరహాలోనే బస్సు యాత్ర కూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
విందు భోజనం పెట్టిన భారత కుటుంబం.. కన్నీళ్లు పెట్టుకున్న రష్యన్ టూరిస్ట్!