టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా, స్టార్ సింగర్ గా ఎం.ఎం.శ్రీలేఖకు( MM Sreelekha ) మంచి గుర్తింపు ఉంది.శ్రీలేఖ ఎక్కువ సంఖ్యలో చిన్న సినిమాలకు పని చేశారు.
శ్రీలేఖ తక్కువ పారితోషికానికే పని చేసినా క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.శ్రీలేఖ మ్యూజిక్ అందించిన సాంగ్స్ లో( Songs ) ఎక్కువ సాంగ్స్ హిట్ అయ్యాయి.
తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా శ్రీలేఖ మ్యూజిక్ అందించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది లేడీ మ్యూజిక్ డైరెక్టర్లలో ఆమె కూడా ఒకరు కావడం గమనార్హం.
తాజా శ్రీలేఖ చేసిన ఒక పని నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆమెను ఎంతగానో ప్రశంసిస్తున్నారు.విజయవాడలో( Vijayawada ) రోడ్డు పక్కన దివ్యాంగులు రోజ్ రోజ్ రోజాపువ్వా పాటకు కచేరీ నిర్వహిస్తుండగా శ్రీలేఖ కూడా వాళ్లతో కలిసి పాట పాడారు.
పాట పాడిన అంధుడైన గాయకుడికి( Blind Singer ) మంచి జరగాలని కోరుకుంటున్నానని ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా కామెంట్లు చేశారు.

ఎం.ఎం.శ్రీలేఖ మంచి మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.75 సినిమాలకు పైగా మ్యూజిక్ అందించిన శ్రీలేఖ కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.శ్రీలేఖ ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఎం.ఎం.శ్రీలేఖ తన టాలెంట్ తో అంతకంతకూ ఎదుగుతున్నారు.ప్రేమించు సినిమాలోని పాట ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఎం.ఎం.శ్రీలేఖకు యంగ్ జనరేషన్ హీరోలు, స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తే ఆమె కెరీర్ మరింత పుంజుకుంటుందని చెప్పవచ్చు. ఎం.ఎం.శ్రీలేఖ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.







