ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో టీడీపీ( TDP ) అధికారంలోకి రావాలని తీవ్ర కసరత్తు చేస్తోంది.ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించింది.
ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) త్వరలో ప్రజల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పెండింగ్ లో ఉన్న 16 అసెంబ్లీ స్థానాలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.ఒకటి, రెండు రోజుల్లోనే ఎంపీ అభ్యర్థులతో పాటు పెండింగ్ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.







