సూర్యాపేట జిల్లా:జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం విద్యానగర్ 60 ఫీట్ల రోడ్డు నందు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన షి టీమ్ పోలీసు సిబ్బంది.విద్యా సంస్థలు ఉన్న ప్రాంతంలో ద్విచక్రవాహనాలు పెద్ద శబ్దాలతో,వేగంగా, అస్తవ్యస్తంగా నడుపుతూ విద్యార్థులకు,ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఆకతాయి యువతను పోలీసు అధీనంలోకి తీసుకుని వారికి ఈరోజు షి టీమ్ కార్యాలయం నందు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినదని ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు.
యువత మంచి ప్రవర్తన కలిగి భవిష్యత్తు పై దృష్టి పెట్టాలని,ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.ఇతరులను,విద్యార్థినిలను ఇబ్బందులకు గురి చేస్తే ఆకతాయిలపై ఈవ్ టీజింగ్ సెక్షన్ ల క్రింద కేసులు నమోదు చేస్తామని షి టీమ్ ఎస్ఐ ప్రవీణ్ హెచ్చరించారు.