తేజసజ్జా ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ( HanuMan Movie )కి 330 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.ఈ స్థాయిలో ఈ ఏడాది కలెక్షన్లు సాధించిన మరో తెలుగు సినిమా లేదనే సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకోగా నిన్నటి నుంచి ఈ సినిమా తెలుగు వెర్షన్ జీ5 యాప్ లో స్ట్రీమింగ్ అవుతోంది.హనుమాన్ తెలుగు వెర్షన్ ఓటీటీలో అందుబాటులోకి రావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
విచిత్రం ఏంటంటే థియేటర్లలో యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న హనుమాన్ కు ఓటీటీలో మాత్రం ఆశించిన టాక్ రాలేదు.ఈ సినిమాలో అంత ప్రత్యేకత ఏముందని రొటీన్ మూవీ అని చివరి 10 నిమిషాలు మినహా సినిమా ఆకట్టుకోలేదని కామెంట్లు చేస్తున్నారు.అయితే ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ ఈ సినిమా ఓటీటీ వెర్షన్ కు నెగిటివ్ టాక్ రావడానికి కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హనుమాన్ సినిమా వల్ల సంక్రాంతికి విడుదలైన ఒక సినిమాకు తీవ్రస్థాయిలో నష్టం కలగగా ఆ స్టార్ హీరో అభిమానులు ప్లాన్ చేసి ఈ దిశగా అడుగులు వేస్తున్నారని భోగట్టా.హనుమాన్ ఓటీటీ వెర్షన్ కు నెగిటివ్ టాక్ విషయంలో మేకర్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.మరోవైపు జై హనుమాన్ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదుచూస్తున్నారు.
ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు పాత్రలలో ఎవరు నటిస్తారనే సందేహాలకు అభిమానులకు ఇంకా సమాధానం దొరకలేదు. జై హనుమాన్ ( Jai Hanuman )సినిమా నిర్మాతలు భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఎప్పుడు విడుదలైనా జై హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో చరిత్ర సృష్టిస్తుందని ఈ సినిమా ఫ్యాన్స్ భావిస్తున్నారు.శ్రీరామనవమి పండుగ సమయంలో ఈ మూవీ నుంచి అప్ డేట్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.