BRS : అసెంబ్లీ స్పీకర్ ను కలవనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం..!

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్( BRS ) ఎమ్మెల్యేల బృందం కలవనుంది.ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్( MLA Dana Nagender ) పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరనున్నారు.

 A Group Of Brs Mlas Will Meet The Speaker Of The Assembly-TeluguStop.com

రాజీనామా చేయకుండా దానం నాగేందర్ పార్టీ ఎలా మారుతారని మండిపడుతున్నారు.అయితే నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ( Gaddam Prasad Kumar )సమయం ఇచ్చినప్పటికీ వారు కలవలేదు.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేయనున్న ఫిర్యాదుపై స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.అయితే ఎమ్మెల్యే దానం నాగేందర్ నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ ( Dipadas Munshi ) సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube