ఏపీలోని అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో సీఈవో ముఖేశ్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.అనుమతి లేని రాజకీయ ప్రకటనలను వెంటనే తొలగించాలని తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని పేర్కొన్నారు.అదేవిధంగా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అయితే లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.







