ఏపీలో ఎన్నికల నగారా మోగింది.కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నేడు షెడ్యూల్ రిలీజ్ చేశారు.
దేశంలో ఈసారి లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) మొత్తం ఏడు దశలలో జరగనుండగా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో మే 13న జరిగే నాలుగవ దశలో పోలింగ్ జరగనుంది.ఏపీలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు ఒకసారే జరుగుతున్నాయి.ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.ఏప్రిల్ 18 నుండి 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వటం జరిగింది.మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.
ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) ట్విట్టర్ లో సంచలన పోస్ట్ పెట్టారు.“13 మే 2024న ఎన్నికలకు సిద్ధం” అని ఏపీ ఎలక్షన్ డేట్ ట్వీట్ చేయడం జరిగింది.అంతేకాదు ఈ ట్వీట్ కు ఓట్ ఫర్ ఫ్యాన్, సిద్ధం ( Vote for Fan, siddam ) అనే హ్యష్ ట్యాగ్ జత చేశారు.జగన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ పోస్ట్ కి వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి మేము కూడా రెడీ అని కామెంట్లు చేస్తున్నారు.2024 ఎన్నికలను వైయస్ జగన్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ తరపున పోటీ చేసే అసెంబ్లీ, పార్లమెంట్ మొత్తం అభ్యర్థులను నేడు ఇడుపులపాయలో వైయస్ ఘాట్ సాక్షిగా.ప్రకటించారు.
అంతేకాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పర్యటించడానికి జగన్ సిద్ధమవుతున్నారు.