ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన “న్యాయసాధన” సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై పలు పార్టీల నేతలపై రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కామెంట్లు చేశారు.
రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు వాళ్ళుగా ఒకరికొకరు అండగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.ఢిల్లీ పాలకులు విశాఖ ఉక్కును కదిలించలేరు.
ఇక్కడి పాలకులు మోదీకి( Modi ) లొంగిపోయారు.రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు.
పదేళ్లయిన రాజధాని ఎక్కడుందో చెప్పలేకపోతున్నారు.పోలవరం ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
ప్రశ్నించే నాయకుడు లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవటం లేదని ఆరోపించారు.గత పాలకులు ఢిల్లీని గట్టిగా అడిగి హక్కుల సాధించుకునే వారు.

ఢిల్లీ శాసించి డిమాండ్లు నెరవేర్చుకునే నాయకులు ప్రస్తుతం ఏపీలో లేరని చురకలు అంటించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైయస్సార్ బిడ్డ షర్మిల ముందుకు వచ్చారని వ్యాఖ్యానించారు.ఏపీ ప్రజల తరఫున పోరాడే నాయకురాలు.వైయస్ సంకల్పం నిలబెట్టే వారే వైయస్ వారసులు.వైయస్ ఆశయాలు మర్చిపోయేవారు వారసులు ఎలా అవుతారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉక్కు ప్రైవేటీకరణ తెలుగు వాళ్ళందరం అడ్డుకుందాం.
హక్కుల విషయంలో తెలుగు వారంతా ఒకటవుదాం అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ ఎద్దేవా చేశారు.
ఇక్కడ ఎవరు గెలిచినా మోదీకి లొంగిపోతారని వ్యాఖ్యానించారు.ఈ ప్రాంత సమస్యల మీద పోరాడే నాయకురాలు వైయస్ షర్మిల.
ఈ ప్రాంతంలో ఎన్నికలు గెలవటం ఆషామాషీ కాదు.అయినా ఆమె పోరాడుతున్నారు.
షర్మిల నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలి.ఆమె ఏపీ సీఎం పీఠంపై కూర్చునే వరకు.
తోడుగా ఉంటా అని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు.







