సూపర్ స్టార్ వెంకటేశ్ ( Superstar Venkatesh )ను తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులు ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి తాజాగా సింపుల్ గా జరిగింది.
పెద్దగా హడావిడి లేకుండానే హయవాహిని( Hayawahini ) వివాహం జరగడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.నిశాంత్ అనే వ్యక్తితో హయవాహిని వివాహం జరిగింది.ఈ జోడీ చూడచక్కగా ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
2023 సంవత్సరంలో అక్టోబర్ నెలలో హయవాహిని నిశ్చితార్థం( Hayawahini engagement ) జరిగింది.హయవాహిని పెళ్లి వేడుకలకు సెలబ్రిటీలను ఎవరినీ ఆహ్వానించలేదని సమాచారం అందుతోంది.కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హయవాహిని నిశాంత్ ల వివాహం జరిగింది.హయవాహిని పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
వెంకటేశ్ ఈ ఏడాది సైంధవ్( Saindhav ) సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నారు.వెంకటేశ్ కు హంగులు, ఆర్భాటాలు ఇష్టం ఉండవని అందువల్లే రెండో కూతురి పెళ్లి సింపుల్ గా జరిపారని సమాచారం అందుతోంది.వెంకటేశ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
వయస్సుకు తగిన పాత్రలను విక్టరీ వెంకటేశ్ ఎంచుకుంటున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో విక్టరీ వెంకటేశ్ ఒకరు కావడం గమనార్హం.వెంకటేశ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.వెంకటేశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
ఇతర భాషల్లో సైతం వెంకటేశ్ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.స్టార్ హీరో వెంకటేశ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మరిన్ని విజయాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.