Tamil Heroes : తెలుగు రాష్ట్రాలలో మార్కెట్ పెంచుకోవడానికే తమిళ హీరోలు ఆసక్తి.. ఎందుకు..?

తమిళ హీరోలు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు రిలీజ్ చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు.చాలా కాలంగా ఈ తమిళ హీరోల సినిమాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్స్ గా కూడా నిలుస్తున్నాయి.

 Tamil Heros Market In Tollywood-TeluguStop.com

చంద్రముఖి, గజిని, ఆరు, వీడొక్కడే, అపరిచితుడు, రోబో, సఖి ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన తమిళ సినిమాలు ఎన్నో ఉన్నాయి.ఒకప్పుడు సూర్య, విక్రమ్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి తమిళ హీరోలు తెలుగులో సినిమాలు రిలీజ్ చేస్తూ హిట్స్ అందుకున్నారు.

ఇప్పుడు తమిళంలో స్టార్స్‌గా రాణిస్తున్న విజయ్, ధనుష్, నయనతార, విజయ్ ఆంటోనీ, విజయ్ సేతుపతి( Vijay, Dhanush, Nayanthara, Vijay Antony, Vijay Sethupathi ) తదితరులు తెలుగు మార్కెట్ పై బాగా ఆధారపడుతున్నారు.

Telugu Bollywood, Dhanush, Nayanthara, Telugu, Tamil Heros, Tamilheros, Tollywoo

తెలుగులో స్ట్రైట్ మూవీలు( Straight Movies in Telugu ) చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తమ మార్కెట్ పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.టాలీవుడ్ ప్రేక్షకులు కథ మంచిగా ఉంటే ఏ సినిమానైనా ఆదరిస్తారు.

అందుకే తమిళం వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది.ఒకప్పుడు తెలుగు వారు కూడా తమిళంలో సక్సెస్ కావాలని ఎంతో ప్రయత్నించారు.

తమిళంలో తెలుగు హిట్ సినిమాలను డబ్ చేసి మరీ రిలీజ్ కూడా చేశారు.కానీ అక్కడివారు వీటిని అస్సలు పట్టించుకోలేదు, దీనివల్ల ఫ్లాప్స్ ఎదురయ్యాయి.

తమిళంలో మార్కెట్ సంపాదించడం అంత సులభం కాదని అర్థం చేసుకొని తెలుగువారు కూడా సైలెంట్ అయిపోయారు.

Telugu Bollywood, Dhanush, Nayanthara, Telugu, Tamil Heros, Tamilheros, Tollywoo

బాహుబలి తర్వాత తెలుగు సినిమాల స్థాయి పాన్ ఇండియా లెవెల్ కు వెళ్ళింది.ఇప్పుడు బాలీవుడ్( bollywood ) ఇండస్ట్రీ కూడా పాన్ ఇండియా వైడ్‌గా సినిమాలను రిలీజ్ చేస్తోంది.అయితే తమిళ హీరోలు మాత్రం ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ పైనే ఫోకస్ చేస్తున్నారు.

తెలుగువారితో కలిసి సినిమాలు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు.ముఖ్యంగా దర్శకులతో కలిసి సినిమాలు చేసి హిట్స్ అందుకోవాలని అనుకుంటున్నారు.

ధనుష్ ఇప్పటికే సార్ మూవీ తీసి పెద్ద హిట్ అందుకున్నాడు.ఇప్పుడు శేఖర్ కమ్ములతో కలిసి మరొక తెలుగు సినిమా చేస్తున్నాడు.

చిన్న ఇండస్ట్రీలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో హిట్స్ అందుకుంటున్న ప్రస్తుత పరిస్థితులలో తమిళ సినిమా వాళ్లు మాత్రం కేవలం తెలుగు మీదే ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.దానికి కారణం ఏంటో వాళ్లకే తెలియాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube