కొంత మందికి భోజనం చేసిన తర్వాత తీపి తినే అలవాటు ఉంటుంది.భోజనం తర్వాత ఏదైనా స్వీట్( Sweet ) తింటే భోజనం త్వరగా జీర్ణం అవుతుందని కూడా పెద్ద వారు చెబుతూ ఉంటారు.
అలాగే శరీరంలో మెగ్నీషియం లోపం వల్ల కూడా ఇలా జరుగుతుంది.అలాగే మెగ్నీషియం, గ్లూకోస్ జీవ క్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
కాబట్టి మెగ్నీషియం లేకపోవడం వలన చక్కెర కోరికలు ఏర్పడతాయి.కాబట్టి మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తినడం వలన ఈ వ్యసనాన్ని నివారించవచ్చు.
అలాగే మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను( Blood Sugar Levels ) స్థిరీకరించడం మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడం ద్వారా చక్కెర కోరికలను నివారించడంలో సహాయపడుతుంది.

అలాగే మెగ్నీషియం( Magnesium ) అనేక శరీర విధులకు అవసరం.మెగ్నీషియం ఆరోగ్యకరమైన ఎముకలు, కండరాలకు కూడా చాలా అవసరం.మెగ్నీషియం మానసిక ఆరోగ్యానికి ఆరోగ్యానికి, టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రించడానికి రక్తం పోటును నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి మెగ్నీషియం కూడా చాలా అవసరం.శరీరంలో మెగ్నీషియం లోపం వివిధ ప్రమాదాలకు దారి తీస్తుంది.అంతే కాకుండా తలనొప్పి, వాంతులు, నిరాశ, ఆందోళన, అలసట, బలహీనమైన ఎముకలు కాల్సిఫికేషన్ మొదలైనవి మెగ్నీషియం లేకపోవడం వలన సంభవిస్తుంది.

అయితే మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలలో డార్క్ చాక్లెట్( Dark Chocolate ) మొదటిది.100 గ్రాముల డార్క్ చాక్లెట్ తో 176 మిల్లీ గ్రాముల మెగ్నీషియం ఉంటుంది.కాబట్టి మెగ్నీషియం లోపాన్ని తొలగించడానికి డార్క్ చాక్లెట్ తినవచ్చు.
అలాగే ఇందులో ఇనుము, రాగి మరియు ఫైబర్ కూడా ఉంటుంది.ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాయి.100 గ్రాముల గుమ్మడి గింజల్లో( Pumpkin Seeds ) 592 మిల్లీ గ్రాముల లో మెగ్నీషియం ఉంటుంది.ఈ జాబితాలో అరటిపండ్లు( Banana ) తర్వాతి స్థానం లో ఉన్నాయి.
వాటిలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది.బచ్చలి కూర ను కూడా పోషకాల స్టోర్ హౌస్ అని చెప్పవచ్చు.
పాలకూరల్లో కూడా మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది.







