ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.కొంతమంది స్కిన్ కేర్( Skin care ) కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు.
కొందరు పార్లర్ కి కూడా వెళ్తూ ఉంటారు.ఇంట్లోనే శెనగపిండిలో ఈ పదార్థాలను మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే ఏడు రోజుల్లో మీ ముఖం మెరిసిపోతుంది.
ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసే సరైన విధానం, దాని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.టమాటో రసంలో రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండిని కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి.
దీన్ని మీ ముఖంపై అప్లై చేసి పది నిమిషాలు అలాగే ఉంచాలి.
![Telugu Curd, Gram, Green Tea Bag, Tips, Skin Care, Skin, Tomato, Turmeric-Telugu Telugu Curd, Gram, Green Tea Bag, Tips, Skin Care, Skin, Tomato, Turmeric-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/03/Skin-care-gram-flour-Skin-health-Tomato-health-health-tips.jpg)
ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడిగేయాలి.ఈ ఫేస్ ప్యాక్ ముడతలు ఇతర యాంటీ ఏజింగ్ సమస్యలను ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.టమాటో రసం మీ చర్మం అందాన్ని మరింత పెంచుతుంది.
ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న కాసేపటికి చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మంచిది.అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి,1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు, పెరుగు అవసరాన్ని బట్టి తీసుకోవాలి.
వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి ప్యాక్ గా వేసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉండి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.
![Telugu Curd, Gram, Green Tea Bag, Tips, Skin Care, Skin, Tomato, Turmeric-Telugu Telugu Curd, Gram, Green Tea Bag, Tips, Skin Care, Skin, Tomato, Turmeric-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/03/Skin-care-gram-flour-Green-tea-bag-Skin-health-Tomato-health-health-tips.jpg)
అలాగే గ్రీన్ టీ బ్యాగ్ ని వేడి నీళ్లలో నానబెట్టి చల్లారగానే శనగపిండి( Gram flour )ని వేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాలు అలాగే ఉండి, ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇది డాట్ సర్కిల్స్ ను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగే పొడి చర్మానికి అరటిపండు ఒక మంచి ఎంపిక అని చర్మ సౌందర్య నిపుణులు చెబుతున్నారు.బాగా పండిన అరటి పండును మెత్తగా చేసి అందులో పాలు లేదా రోజు వాటర్ ని కలపాలి.
ఆ తర్వాత శనగపిండి వేసి మిక్స్ చేసుకోవాలి.తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి పది నిమిషాలు తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
పైన చెప్పిన చిట్కాలను వారం రోజులు పాటిస్తే మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.