రాజన్న సిరిసిల్ల జిల్లా: మున్నూరు కాపు( Munnuru Kapu ) ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించడం హర్షనీయమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మున్నూరు కాపుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎల్లారెడ్డిపేట మండల మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు నంది కిషన్, పట్టణ అధ్యక్షులు బాద రమేష్, గౌరవ సలహాదారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి అన్నారు.శుక్రవారం ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy ) చిత్ర పటానికి ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం , పట్టణ మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలోపాలాభిషేకం చేశారు.
అనంతరం విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండల మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు నంది కిషన్ మాట్లాడుతూ.మున్నూరు కాపుల ఆకాంక్ష అయినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఫైనాన్స్ కార్పొరేషన్ వలన అభివృద్ధి జరుగుతుందన్నారు.
గత ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం శుభ పరిణామం అన్నారు.ఎల్లారెడ్డిపేట పట్టణ మున్నూరు కాపు సంఘ గౌరవ సలహాదారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు నిధులు ఇవ్వాలని, నిధులు ఉంటేనే మున్నూరు కాపుల అభివృద్ధి మరింత సాధ్యమవుతుందన్నారు.
కులవృత్తిని నమ్ముకొని దేశ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న మున్నూరు కాపుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించాలన్నారు.
దశాబ్ద కాలంగా కార్పొరేషన్ కోసం మన రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవన్న అధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలు ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసి కార్పొరేషన్ ఇవ్వాలనిడిమాండ్ చేయడం జరిగిందన్నారు.
కార్పొరేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని కోరారు.ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర పొన్నం ప్రభాకర్ గౌడ్ కు, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కు , సీతక్క కు మున్నూరు కాపుల ముద్దు బిడ్డలు కొండ సురేఖ కు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు పాత తులసి, సిరిపురం మహేందర్, చకినాల నారాయణ, సిరిపురం రాజిరెడ్డి, మెగి నర్సయ్య , మండల ప్రధాన కార్యదర్శి వడ్నాల భాస్కర్, సాన రవి, శ్యామంతుల అనిల్ , సివిల్ కాంట్రాక్టర్ జవాజి లింగం, గ్రామ శాఖల అధ్యక్షులు శీలం అనిల్ కుమార్, మెడిశెట్టి రవి, చకినాల కృష్ణ, భూపతి, కిష్టయ్య, పర్షరాములు, ఇందూరి కిషన్, మిట్టపల్లి బాలయ్య, యూత్ లీడర్ కాసుల రాము, శ్రీధర్ , వడ్నాల ఆంజనేయులు, లక్ష్మన్, కిషన్, ఉప్పుల రవి లక్ష్మీరాజం, తదితరులు పాల్గొన్నారు.