లిక్కర్ స్కామ్ కేసు( Delhi Liquor Scam Case )లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( Kavitha )ను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించడం జరిగింది.శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో అరెస్టు చేసి ఢిల్లీ తరలించడం జరిగింది.
ఈ రాత్రికి ఢిల్లీ ఈడీ కార్యాలయంలోనే కవిత ఉండనున్నారు.అనంతరం రేపు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.
ఈ నేపథ్యంలో కవిత సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా హుటాహుటిన హస్తినకు బయల్దేరారు.కవిత అరెస్టుపై సీనియర్ న్యాయవాదులతో చర్చించనున్న ఆయన.ఈ అంశంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై సమాలోచనలు చేసే అవకాశం ఉంది.

అటు తన అరెస్టుపై రేపు సుప్రీంలో కవిత పిటిషన్(MLC Kavitha Arrest ) దాఖలు చేయనున్నారు.ఈ విషయం నడుస్తూ ఉండగానే మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ అధికారులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు సందర్భంగా తమపై ఆయన దౌర్జన్యం చేశారని తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.తాజా పరిస్థితుల వల్ల సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ కవిత అరెస్టు కావటం బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
కవిత అరెస్టు వెనకాల కాంగ్రెస్, బీజేపీ( Congress, BJP ) పార్టీలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.







