జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా( Devara _కు షూట్ మొదలైనప్పటి నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.సైఫ్ అలీ ఖాన్ కు గాయం కావడం, అనిరుధ్ అనుకున్న సమయానికి ట్యూన్స్ ఇవ్వకపోవడం దేవర మేకర్స్ ను ఇబ్బంది పెట్టాయి.
దేవర ఫస్ట్ సింగిల్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదల కానుందని సమాచారం అందుతోంది.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది అదిరిపోయే తీపికబురు అనే చెప్పాలి.
దేవర సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుందని నోరా ఫతేహి( Nora Fatehi ) ఆ స్పెషల్ సాంగ్ చేయనున్నారని సమాచారం అందుతోంది.టెంపర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన నోరా ఫతేహి చాలా కాలం తర్వాత తారక్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నారని తెలుస్తోంది.
దేవర సినిమా నెలాఖరు నుంచి స్పీడ్ పుంజుకోనుందని సమాచారం అందుతోంది.ఈ నెల చివరి వారంలో భారీ షెడ్యూల్ మొదలుకానుందని తెలుస్తోంది.
ఈ భారీ షెడ్యూల్ తో దేవర షూట్ ముగియనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ షూట్ జరగనుందని భోగట్టా ఇప్పటికే ఇందుకు సంబంధించిన సెట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని సమాచారం అందుతోంది.ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి వార్2 సినిమాతో ఎన్టీఆర్ బిజీ కానున్నారని తెలుస్తోంది.ఈ సినిమాలో జాన్వీ పర్ఫామెన్స్ అదుర్స్ అనేలా ఉండనుందని భోగట్టా.
దేవర సినిమా నిర్మాతగా కళ్యాణ్ రామ్( Kalyan Ram ) స్థాయిని పెంచుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.తారక్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు.ఆర్.ఆర్.ఆర్ వరకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న తారక్ తన పారితోషికాన్ని భారీ రేంజ్ లో పెంచేశారు.దేవర సినిమా సీక్వెల్ దేవర2 కూడా భారీ రేంజ్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
దేవర సీక్వెల్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.