ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇదివరకే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అటువంటి వాటిలో సేవ్ ది టైగర్స్ ( Save The Tigers ) ఒకటి.
డైరెక్టర్ మహి వీ రాఘవ్ షో రన్నర్‌గా, అరుణ్ కొత్తపల్లి డైరెక్షన్లో తీసిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియెన్స్‌ను భారీ స్థాయిలో నవ్వించింది అయితే తాజాగా సీజన్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే…
కథ:
సేవ్ ది టైగర్స్ కథ ఎక్కడ అంతం అయిందో.రెండో సీజన్ అక్కడే మొదలవుతుంది.హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్) కిడ్నాప్ అంటూ.విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభినవ్ గోమఠం), గంటా రవి (ప్రియదర్శి)లను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు.ఇక ఆ ముగ్గుర్నీ పోలీసులు చితక్కొట్టేస్తారు.
తీరా చూస్తే హంసలేఖ మత్తులోంచి బయటకు వచ్చి.ఆ ముగ్గురు అమాయకులు వారికి ఏమీ తెలియదని వారి వల్లే తాను సేవ్ అయ్యానని విషయాన్ని చెబుతుంది.
ఆ తర్వాత హంసలేఖ రావడంతో వీరి ముగ్గురి జీవితాలు ఎలా మారిపోయాయి? విక్రమ్, రేఖ (దేవియాని శర్మ).రాహుల్, మాధురి (పావని గంగిరెడ్డి).
గంటా రవి, హైమావతి (జోర్దార్ సుజాత)ల మధ్య ఏర్పడిన పరిస్థితులు ఏంటి? గంటా రవి కార్పోరేటర్ అవుతాడా? ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
నటీనటుల నటన
: ఫస్ట్ సీజన్లో లాగే ఈ సీజన్లో కూడా ప్రియదర్శి( Priyadarshi ) అభినవ్ గోమటం వారి నటన ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించారు.ఇక ప్రియదర్శి తన కామెడీతో నవ్వించడమే కాకుండా ఎమోషనల్ గా అందరి చేత కన్నీళ్లు కూడా పెట్టించారు.అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్, ఆ డైలాగ్ డెలివరీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
రాహుల్ పాత్రల కృష్ణ చైతన్య జీవించేసాడు.జోర్దార్ సుజాత, దేవయాని శర్మ పావని సైతం వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారని చెప్పాలి.
టెక్నికల్:
అరుణ్ కొత్తపల్లి డైరెక్షన్ ఎంతో అద్భుతంగా ఉంది.నిర్మాణ విలువలు బావున్నాయి.అజయ్ అరసాడ సంగీతం, ఆర్ఆర్ మూడ్‌కు తగ్గట్టుగా సాగుతుంది.ఫ్యామిలీ అంతా కూర్చుని ఎంజాయ్ చేసేలా ఈ వెబ్ సిరీస్ పెద్ద ఎత్తున అందరిని ఆకట్టుకుందని చెప్పాలి టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా చాలా హైలెట్గా నిలిచింది.
విశ్లేషణ:
సేవ్ ది టైగర్స్ 2 ఎంత వినోదాత్మకంగా ఉందో అంతే సందేశాత్మక సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని చెప్పాలి.సమాజంలోని మనుషులు ఎలా ఉన్నారు వారి వ్యక్తిత్వం వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనే విషయాలను ఎంతో అద్భుతంగా చూపించారు.ఈ సిరీస్ లో భార్యాభర్తల అనుబంధం తండ్రి కూతుర్ల మధ్య అనుబంధం, ఒక తండ్రిని చూసి తమ పిల్లలు ఎలా ప్రభావితం అవుతారనే విషయాలను ఎంతో అద్భుతంగా చూపించారు.మొత్తానికి ఒక హాయిగా నవ్వుకునే మంచి సందేశాత్మక సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిందని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్:
కథ, కథనం, నటీనటులు, తవ్వించే సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు.
బాటమ్ లైన్:
ఒక అద్భుతమైన సందేశాత్మక చిత్రంగా నవ్వులను పంచుతూ అందరిని కడుపుబ్బా నవ్విస్తుందని చెప్పాలి.
రేటింగ్: 3/5