ప్రజాపాలనకు వంద రోజులు. ప్రజా నాయకుడికి చిరుకానుక

హైదరాబాద్ :విస్త‌రాకులో సీఎం రేవంత్ రెడ్డి 100 రోజులు ప్ర‌జా పాల‌న చిత్రం.మార్చి 15న ప్ర‌జా పాల‌నకు 100 రోజులు అయిన సంద‌ర్భంగా.

 Hundred Days Of Public Administration A Gift To A Public Leader , Hundred Days O-TeluguStop.com

అమెరికాలోని కాలిఫోర్నియాలో (బే ఏరియా) ఉండే ప్ర‌ముఖ చిత్ర‌కారుడు అరవింద్ కొత్త సీఎంపై అభిమానంతో ఈ ఆర్ట్ వేశారు.భార‌తీయ సంస్కృతిలో భాగ‌మైన విస్త‌రాకును వినూత్న‌రీతిలో తీర్చిదిద్ది కానుగా ఇస్తున్నారు.

ఒక అరుదైన క‌ళ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.రేవంత్‌రెడ్డి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్పుడు కూడా అరవింద్ త‌న క‌ళా నైపుణ్యంతో ఇలాంటి ఒక ఆర్ట్ వేసి గిఫ్ట్‌గా ఇచ్చారు.

గ‌తంలో అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా 54వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఒబామా ర‌క‌ర‌కాల హావ‌భావాల‌ను స్కెచ్ వేసి కానుక‌గా ఇచ్చారు.అప్ప‌ట్లో ఇది ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.2004లో హైద‌రాబాద్‌లో ఐదు రోజుల పాటు నిర్విరామంగా 108 గంట‌ల పాటు స్కెచ్ గీసి గిన్నిస్ రికార్డు సాధించిన అర‌వింద్‌.వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.

నారా చంద్ర‌బాబు నాయుడు.అబ్దుల్ క‌లామ్‌.

ఎస్పీ బాల‌ సుబ్ర‌హ్మ‌ణ్యం వంటి ఎంద‌రో ప్ర‌ముఖుల స్కెచ్‌లు వేసి శ‌భాష్ అనిపించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube