ధూమపానం( Smoking ) ఆరోగ్యానికి హానికరం క్యాన్సర్ కు కారకం అని అందరికీ తెలుసు.కానీ ప్రతి ఏడాది ధూమపానం చేసేవారి సంఖ్య పెరుగుతుందే తప్ప తరగడం లేదు.
కొందరైతే ఎటువంటి లిమిట్ లేకుండా రోజులో పెట్టెలు పెట్టెలు సిగరెట్లు కాల్చేస్తుంటారు.కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే రెండు అంగుళాల సిగరెట్ ఆరడుగుల మనిషిని కూల్చేస్తుంది.
ఏటా పొగాకు మహమ్మారి కొన్ని లక్షల మందిని బలి తీసుకుంటుంది.సిగరెట్ తాగడం వల్ల గుండె, జీవక్రియ, హార్మోన్లు మరియు మెదడు వంటి వివిధ శరీర భాగాలను ప్రభావితం చేస్తాయి.
అనేక ఆరోగ్య సమస్యలను( Health Problems ) తెచ్చి పెడతాయి.అందుకే కొందరు స్మోకింగ్ మానేయాలని అనుకుంటారు.
కానీ మానలేకపోతుంటారు.స్మోకింగ్ మానేయడం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు.
కొన్ని కొన్ని ఆహారాలు ధూమపానం మానేయడంలో మీకు గ్రేట్ గా సహాయపడతాయి.ఈ నేపథ్యంలోనే స్మోకింగ్ మానాలను కుంటున్నప్పుడు ఏయే ఆహారాలు తినాలి.? ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ధూమపానానికి స్వస్తి పలకాలనుకుంటే మీరు మీ డైట్ లో పాలు, పాల ఉత్పత్తులను( Milk Products ) చేర్చుకోండి.పాలు, పెరుగు, వెన్న మరియు జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో కేసిన్ అనే సమ్మేళనం ఉంటుంది.ఇది నికోటిన్ కోరికను తగ్గించడానికి తోడ్పడుతుంది.అలాగే ధూమపానానికి దూరంగా ఉండటానికి గ్రీన్ టీ అత్యంత ప్రభావవంతమైన పానీయాలలో ఒకటి.స్మోకింగ్ అలవాటును మానేయాలనుకుంటే రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీను తీసుకోండి.గ్రీన్ టీ( Green Tea )లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి ధూమపానం చేయాలనే బలమైన కోరికను అణచి వేస్తుంది.స్మోకింగ్ మానేయాలనుకుంటే తాజా కూరగాయలు, సీజనల్ పండ్లు తీసుకోండి ఇవి మీ శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ అందిస్తాయి.
అదే సమయంలో ధూమపానం చేయాలనే కోరికలను తీర్చడానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా సహాయపడతాయి.
విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహారాలు నికోటిన్ కోరికలు తగ్గించడంలో సహాయపడతాయి.మరియు మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.కాబట్టి నారింజ, స్ట్రాబెర్రీ( Strawberry ), బెల్ పెప్పర్స్ వంటి ఆహారాలను డైట్ లో చేర్చుకోండి.
ఇక స్మోకింగ్ మానేయాలనుకునేవారు ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.కాఫీ( Coffee ), మాంసాహారం, చక్కెర, చక్కెరతో తయారు చేసిన ఆహారాలను ఎవైడ్ చేయాలి.
ఎందుకంటే ఇవి సిగరెట్లపై కోరికలను పెంచుతాయి.మరియు స్మోకింగ్ మానేయాలనుకుంటే మీరు మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి.
అప్పుడే మీరు అనుకున్నది సాధ్యం అవుతుంది.