మనం ఇంటర్నెట్‌లో చాలా వైరల్ వీడియోలు చూస్తూ ఉంటాం.అందులోనూ అందరూ ఇష్టపడే అంశం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఫుడ్ అయి ఉంటుంది.
ఆహారానికి సంబంధించిన వీడియోలను చాలా మంది ఆసక్తిగా చూస్తూ ఉంటారు.పసందైన వంటకాలు తమ ప్రాంతాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో ఏం ఉన్నాయో అని సెర్చ్ చేస్తుంటారు.
అలాంటి వారందరికీ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ స్వాగతం పలుకుతోంది.ముఖ్యంగా వేసవిలో చల్ల చల్లని ఐస్‌క్రీమ్( Ice Crea ) తినాలనుకునే వారికి ఇది స్వర్గధామం.
ఇక్కడ దొరికేది మామూలు ఐస్‌క్రీమ్ కాదండోయ్.ఏకంగా బంగారంతో తయారు చేసిన ఐస్ క్రీమ్.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.అందులో బంగారు పూత, రజనుతో కూడిన ఐస్ క్రీమ్‌ను కస్టమర్లు లొట్టలు వేసుకుని తింటున్నారు.
అయితే బంగారంతో చేసినది కదా దీని ధర ఎంత ఉందని అనుకుంటున్నారా? అయితే ఈ ఆసక్తికర కథనం మీరు చదవాల్సిందే.

వెరైటీ వంటకాలను ఇష్టపడని వారు ఉండరు.ఇదే కోవలో బంగారం అంటే కూడా చాలా మందికి ఇష్టం.అలాంటిది ఈ రెండింటి కాంబినేషన్‌లో ఫుడ్ అంటే చాలా మంది ఆశ్చర్యపోతారు.
ఎందుకంటే బంగారం అనేది చాలా ఖరీదైన లోహం.అలాంటి విలువైన లోహంతో చేసిన ఫుడ్ అంటే అందరూ విచిత్రంగా చూస్తారు.
అయితే ఈ విషయంలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ ఫుడ్ ప్రియులకు గుడ్ న్యూస్ అందిస్తోంది.బంగారు పూతతో కూడిన ఐస్ క్రీమ్‌ను కస్టమర్లకు అందిస్తోంది.అయితే దీని ధర కేవలం రూ.999 మాత్రమే ఉంటుంది.స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం పూత( 24 Carat Gold Ice Cream )ను ఐస్ క్రీమ్‌పై చల్లుతారు.దీనిని సాధారణ ఐస్ క్రీమ్‌లాగానే తినేయొచ్చు.
నోటిలో పెట్టుకోగానే వెంటనే కరిగి పోతుంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

దుకాణదారుడు చాక్లెట్ కోన్‌లో ఐస్‌క్రీం( Chocolate Cone Ice Cream ) పెట్టడంతో వీడియో ప్రారంభమవుతుంది.అప్పుడు అతను దాని మీద బంగారు రేకును ఉంచి, దానిపై కొన్ని చెర్రీలను ఉంచాడు.సాధారణంగా ఇలాంటి ఫుడ్ విదేశాల్లో లభిస్తుందని అంతా అపోహ పడుతుంటారు.అయితే ఈ వెరైటీ గోల్డ్ ఐస్ క్రీమ్ ఇప్పుడు భాగ్యనగర ప్రజలకు కూడా లభిస్తోంది.ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.గోల్డెన్ ఐస్ క్రీమ్( Golden Ice Cream ) అంటే ధర లక్షల్లో ఉంటుందని భావించామని, అయితే కొనగలిగే ధర ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఎప్పుడైనా వెరైటీ కావాలంటే వేసవిలో ఇలా గోల్డెన్ ఐస్ క్రీమ్ తినేయొచ్చని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.







