యాదాద్రి భువనగిరి జిల్లా:em>తెలుగులో రామాయణాన్ని( Ramayana ) అనువందించిన తొలి మహిళ కవయిత్రి కుమ్మరి మొల్ల(Molla ) జయంతి వేడుకలు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కుమ్మరి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు చిలివేరు అంజయ్య,ఎంపిపి గుత్తా ఉమాదేవి మాట్లాడుతూ ఇలాంటి వారి చరిత్రను కనుమరుగు కాకుండా పాఠ్యపుస్తకాల్లో చేర్పించి ప్రభుత్వం గుర్తించి జయంతి,వర్ధంతి ఉత్సవాలని నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య,మాజీ సర్పంచ్ నరసింహ,కాంగ్రెస్ పార్టీ నాయకులు గుత్తా ప్రేమ్చందర్ రెడ్డి,ఏపూరి సతీష్,పెంటయ్య,శ్రీను తదితరులు పాల్గొన్నారు.