Thyroid Symptoms : ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు..!

ముఖ్యంగా చెప్పాలంటే వృద్ధులలో థైరాయిడ్‌ హార్మోన్( Thyroid Harmone ) మోతాదులు తగ్గడం తరచూ చూస్తూనే ఉంటాం.ఇది వయసుతో పాటు నెమ్మదిగా పెరుగుతుంది.

 Thyroid Symptoms : ఈ లక్షణాలు కనిపిస్తే అ�-TeluguStop.com

కానీ చాలా మందికి హైపోథైరాయిడిజమ్‌ ఉన్నటైనా తెలియదు.లక్షణాలు స్పష్టంగా లేకపోవడం ఇతర జబ్బులకు లక్షణాల మాదిరిగా కనిపించడమే దీనికి కారణం.

థైరాయిడ్‌ హార్మోన్‌ తగినంతగా లేకపోతే అవయవాల పని తీరు తగ్గిపోతుంది.జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది.

విషయ గ్రహణ సామర్ధ్యం తగ్గిపోతుంది.బరువు పెరగడం, మగత, చర్మం పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి.

వీటిని చాలా వరకు వృద్ధాప్య మార్పులు గానే భావిస్తారు.

కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్ సమస్యలు ఉన్న గతంలో ఎప్పుడైనా థైరాయిడ్ సమస్యలకు చికిత్స తీసుకున్నా మెడ వద్ద పెద్ద శస్త్ర చికిత్సలు చేయించుకున్న, రేడియోథెరపీ తీసుకున్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

వృద్ధుల్లో హైపోథైరాయిడిజమ్‌( Hypothyroidism ) లక్షణాల గురించి తెలుసుకొని ఉండటం అనుమానం వస్తే వెంటనే పరీక్ష చేయించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.కొన్ని సార్లు వృద్ధులలో ఇదొక్కటే హైపోథైరాయిడిజమ్‌ లక్షణం కావచ్చు.

థైరాయిడ్ హార్మోన్లు పడిపోయినప్పుడు శరీరం కొలెస్ట్రాల్‌ను విడగొట్టలేదు.

Telugu Heart, Hypothyroidism, Memory, Thyroid-Telugu Health

అలాగే చెడ్డ కొలెస్ట్రాల్‌ను తొలగించలేదు.దీంతో రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు( Cholestrol Levels ) పెరిగిపోతాయి.హైపోథైరాడిజం వల్ల రక్త పరిమాణం తగ్గుతుంది.

గుండె కండర సంకోచాలు బలహీనపడతాయి.గుండె వేగం నెమ్మదిస్తుంది.

ఇవన్నీ గుండె వైఫల్యానికి దారితీస్తాయి.గుండె పంపింగ్‌( Heart Pumping ) సామర్థ్యం తగ్గితే నిస్సత్తువ ఆవహిస్తుంది.

నెమ్మదిగా నడుస్తూ ఉంటారు.సమస్య మరింత తీవ్రమైతే ఊపిరితిత్తులలో, కాళ్లలో నీరు చేరుతుంది.

ఇది ఆయాసం కాళ్ల వాపు కు దారి తీస్తుంది.థైరాయిడ్ హార్మోన్లు తగ్గితే పేగుల కదిలికలు నెమ్మదిస్తాయి.

ఫలితంగా మలబద్ధక సమస్య( Constipation ) వస్తుంది.కొందరిలో ఇదొక్కటే థైరాయిడ్ సమస్యకు సంకేతం కావచ్చు.

Telugu Heart, Hypothyroidism, Memory, Thyroid-Telugu Health

అలాగే జీవక్రియ వేగం తగ్గిపోతుంది.దీంతో ఒంట్లో నీరు పెరుగుతుంది.ఇది కీళ్లు కండరాల నొప్పులకు దారి తీస్తుంది.ముఖ్యంగా కాళ్లలోని పెద్ద కండరాల నొప్పులు తలెత్తుతాయి.చిన్న వయసులో థైరాయిడ్ పని తీరు తగ్గిన వారిలో కుంగుబాటు, డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది.ఇది వృద్ధులలోనూ తక్కువమే కాదు.

తేడా ఏమిటంటే వృద్ధుల్లో కుంగుబాటు ఒక్కటే హైపోథైరాయిడిజమ్‌ లక్షణం కావటం.కొందరు భ్రాంతులకూ కూడా లోనవుతుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube