కొన్ని సినిమాలు ఫెయిల్ కావడానికి అనేక కారణాలు ఉంటాయి.అలాంటి సినిమాలలో “సప్తస్వరాలు” ఒకటి.1969లో విడుదలైన “సప్తస్వరాలు( Saptaswaralu )” సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.దీని ఖర్చు భరించిన నటుడు కాంతారావు( Kanta Rao )కి ఏకంగా ఆరు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.
ఆ సమయంలో ఈ మొత్తం చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు.కాంతారావు తన భార్య హేమ పేరుతో హేమా ఫిలింస్ కంపెనీ స్థాపించి దాని ఆధ్వర్యంలోనే ఈ సినిమాని తీశాడు.
ఆ బ్యానర్ కింద వచ్చిన తొలి సినిమానే తీవ్రమైన నష్టం కలిగించడం చాలా బాధాకరమని చెప్పుకోవచ్చు.ప్రముఖ నటుడు తాడేపల్లి లక్ష్మీకాంత దీనిని నిర్మించారు.కానీ నష్టాలు, కష్టాలు మాత్రం కాంతారావుకే వచ్చాయి.
ఈ సినిమా విడుదల అయిన టైమ్‌లోనే చెన్నారెడ్డి నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మేల్కొన్నది.దానివల్ల తెలంగాణ( Telangana )లో నైట్ సెకండ్ షోలు క్యాన్సల్ అయ్యాయి.నిజానికి కాంతారావు సినిమాలను తెలంగాణ వాళ్లు మాత్రమే ఎక్కువగా చూస్తారు.
ఆంధ్రాలో కాంతారావు తెలంగాణా వ్యక్తి అనే ప్రచారం జరిగింది.అందువల్ల వాళ్ళు ఈ సినిమా గురించి పట్టించుకోలేదు.
ఈ కారణాలతోపాటు సినిమా కథ కూడా చాలా వరస్ట్ గా ఉంది.మొత్తం మీద ఈ మూవీ ని ఎవరు చూడకపోవడంతో చివరికి కాంతారావుకు అప్పటి కాలంలోనే ఆరు లక్షల నష్టం కలిగింది.
ఈ ఫ్లాప్ సినిమాకు వేదాంతం రాఘవయ్య ( Vedantam Raghavayya )దర్శకత్వం వహించాడు.ఇందులో కాంతారావు , రాజశ్రీ, విజయలలిత , ధూళిపాళ, సత్యనారాయణ , బాలకృష్ణ, రాజబాబు, విజయనిర్మల, మీనాకుమారి, జ్యోతిలక్ష్మి , నాగయ్య వంటి దిగ్గజ నటీనటులు నటించారు.
టివి రాజు పాటలు కంపోజ్ చేశాడు.ఇందులోని కొన్ని పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ అయ్యాయి.ముఖ్యంగా అదే నీవంటివి అదే నేనింటిని, కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా వంటి మెలోడీ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.నిజం చెప్పాలంటే T.V.రాజు సంగీతం అందించిన అద్భుతమైన సాహిత్యంతో మ్యూజికల్ హిట్ గా నిలిచింది కానీ డబ్బులు మాత్రం వసూలు చేయలేకపోయింది.ఇందులోని డాన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది.చూడాలనుకునేవారు యూట్యూబ్ లో ఈ సినిమా పేరు వెతకడం ద్వారా ఒకసారి చూడవచ్చు.