Pawan Kalyan : రాజకీయాల్లో యుద్ధమే.. బంధుత్వం ఉండదు..: పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కీలక వ్యాఖ్యలు చేశారు.గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేస్తే బంధుత్వాలతో సంకెళ్లు వేశారని ఆయన తెలిపారు.

 Politics Is War There Is No Kinship Pawan Kalyan-TeluguStop.com

యుద్ధం చేయనీయకుండా తనకు సంకెళ్లు వేశారని పేర్కొన్నారు.ఎమ్మెల్యేగా ఓడిపోయినా తనను గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు.

ఈ నేపథ్యంలో భీమవరం( Bhimavaram ) నియోజకవర్గాన్ని తాను వదలనని స్పష్టం చేశారు.ఎవరెన్ని కోట్లు పంచినా భీమవరంలో గెలుపు తమదేనని పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో తాను గెలిచి ఉంటే ఇవాళ పరిస్థితి వేరేలా ఉండేదన్న జనసేనాని పవన్ తాను తీసుకున్న సీట్లు తక్కువా, ఎక్కువా అనేది పక్కన పెట్టాలన్నారు. జనసేన – టీడీపీ – బీజేపీ( Jana Sena – TDP – BJP ) 175 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని భావించాలని సూచించారు.

జగన్( Jagan ) అధికారంలో ఉండకూడదన్న పవన్ కల్యాణ్ అన్యాయం జరిగితే యుద్ధం ఎలా చేయాలో తనకు తెలుసన్నారు.ఈ క్రమంలోనే రాజకీయాల్లో యుద్ధమేనన్న ఆయన బంధుత్వం ఉండదని స్పష్టం చేశారు.

తమ యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రక్షాళన అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube