Kalyani, Surya Kiran : ఆ అప్పుల వల్లే కళ్యాణి సూర్య కిరణ్ విడాకులు తీసుకోవాల్సి వచ్చిందా.. ఏం జరిగిందంటే?

గత కొద్ది రోజులుగా పచ్చకామెర్ల సమస్యతో బాధపడుతున్న డైరెక్టర్ కమ్ నటుడు సూర్యకిరణ్( Surya Kiran ) తాజాగా సోమవారం రోజు చెన్నైలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.ఆయన మరణ వార్త గురించి తెలుసుకున్న పలువురు సెలబ్రిటీలు అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.

 The Reason Behind Kalyani Suriyakirans Divorce-TeluguStop.com

కాగా తమిళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ స్టార్ చేసిన కిరణ్ అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు.పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు.

బాల నటుడిగా 200 ల సినిమాలకు పైగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Telugu Kalyani, Karate Kalyani, Surya Kiran, Tollywood-Movie

అయితే ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన కళ్యాణిని( Kalyani ) సూర్య కిరణ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.కానీ వీరిద్దరు ఎక్కువ కాలం కలిసి జీవించలేకపోయారు.పలు కారణాల వల్ల విడాకులు ( Divorce ) తీసుకున్నారు.

ఈ దర్శకుడు హఠాత్తుగా చనిపోవడంతో సినీ ఇండస్ట్రీలో సూర్య కిరణ్ విషయాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.సూర్య కిరణ్-కళ్యాణి పెళ్లైన కొత్తలో ఎంతో అనోన్యదంపతులుగా కలిసి మెలసి ఉండేవారట.

ఏ ఈవెంట్స్ కైనా ఇద్దరు కలిసే హాజరయ్యేవారట.కానీ ఒక్కసారిగా వీరిద్దరు డివోర్స్ తీసుకుంటున్నామని చెప్పి ఫ్యాన్స్ కు షాకిచ్చారట.

Telugu Kalyani, Karate Kalyani, Surya Kiran, Tollywood-Movie

ఇక పలు ఇంటర్వ్యూలకు హాజరైన సూర్య కళ్యాణి అంటే ఎంతో ఇష్టమని, కానీ ఆమెను నాతో కలిసుండటం ఇష్టం లేదని, తన మీద గౌరవంతో, ఇష్టంతో డివోర్స్ ఇచ్చానని సూర్య చెప్పుకొచ్చాడు.మేం 15 సంవత్సరాలు కలిసి కాపురం చేశాను.మేము ఏ రోజు గొడవలు పెట్టుకోలేదు.కళ్యాణి చాలా మంచి అమ్మాయి.

కానీ సొంత ప్రొడక్షన్ లో మూవీస్ తీయడం ద్వారా ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది.అప్పుడు చాలా అప్పులు అయ్యాయి.

కళ్యాణి దీనికి బయపడే డివోర్స్ తీసుకుందేమో.కోర్టు మీరు ఎందుకు డివోర్స్ తీసుకుంటున్నారని కారణం అడిగినప్పుడు కూడా తను ఏం సమాధానం చెప్పలేదు.

ఆయన నిన్ను కొడతారా? తిడతారా? బాగా టార్చర్ పెడతారా? అని జడ్జి ప్రశ్నించగా లేదు అని చెప్పింది.మరి ఎందుకు డివోర్స్ కావాలనుకుంటున్నావమ్మా అని అడిగితే సైలెంట్ గా ఉంది అంటూ సూర్య కిరణ్ గతంలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో అభిమానులు గుర్తు చేసుకుంటూ ఆయన మంచితనాన్ని కొనియాడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube