దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhar Reddy )ఆశయసాధన కోసమే వైసీపీ పని చేస్తోందని మంత్రి విడదల రజిని( minister vidudala rajini ) అన్నారు.ఏపీని అభివృద్ధి చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామన్నారు.
ఈ క్రమంలోనే సీఎం జగన్( CM Jagan ) త్వరలోనే మ్యానిఫెస్టోను ప్రకటిస్తారని ఆమె తెలిపారు.జగన్ ఈ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారని ఆరోపించారు.అయితే ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా సీఎం జగన్ ను ఓడించలేరని మంత్రి రజిని ధీమా వ్యక్తం చేశారు.







