హైదరాబాద్ లోని( Hyderabad ) పరేడ్ గ్రౌండ్స్ లో మహిళా స్వయం సహాయక సంఘాల సమ్మేళనం జరగనుంది.ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సమావేశం కానున్నారు.సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఈ సమ్మేళనానికి సుమారు లక్ష మంది మహిళలు హాజరయ్యే అవకాశం ఉంది.ఈ క్రమంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు( Interest-Free Loans ) సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు.

అదేవిధంగా స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం ప్రకటించనుందని తెలుస్తోంది.దాంతో పాటుగా మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయంపై కూడా కాంగ్రెస్ సర్కార్( Congress Government ) కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.







