సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారడం ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాం.ఇందులో అనేక రకాల వీడియోలు ప్రజలకు ఎంటర్టైన్ కలగజేసేలా ఉన్నా.
కొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.ఈ మధ్యకాలంలో కొన్ని రకాల ఫుడ్ వీడియోలు( Food Videos ) సోషల్ మీడియాలో వైరల్ గా మారడం గమనిస్తూనే ఉంటాం.
ఈ ఫుడ్ వీడియోలు చూసినప్పుడు అలాంటివి మనం కూడా చేసుకొని తిందామా అని అనుకుంటాము.మరికొన్ని వీడియోలైతే ఇలాంటివి ఎందుకురా.
జీవితంపై జనాలకు విరక్తి తెప్పించేలా కూడా ఉంటాయి.కొంతమంది అయితే వెరైటీ కోసం జనాల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదంటే నమ్మండి.
ఇకపోతే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో బర్గర్ ను ఐస్ క్రీమ్ తో కలిపి చేయడం కనపడుతుంది.

మామూలుగా బర్గర్( Burger ) అంటే కాస్త స్పైసీగా ఉండి.అందులో చికెన్, మటన్ లేక కూరగాయలతో కలిపి తినే విధంగా తయారు చేస్తారు.అయితే అది కాస్త ఇప్పుడు స్వీట్ గా మారిపోయింది.
నిజానికి ఇది భారతీయపు వంట కాకపోయినా కానీ మన భారతీయులు దీన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు.అందుకే భారత్ లో కూడా దీని డిమాండ్ కాస్త ఎక్కువని చెప్పాలి.
కాకపోతే ఇప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్ తో( Chocolate Ice Cream ) తయారు చేసిన బర్గర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించిన వీడియోలో ఓ వ్యక్తి చాక్లెట్ బర్గర్ ను తయారు చేస్తున్నారు.చాక్లెట్ ఫ్లేవర్ తో ఉన్న బర్గర్ పీస్ ని తీసుకొని దానిపై చల్లని ఐస్ క్రీమ్ ను ఉంచుతాడు.ఆపై ఏవో కొన్ని రకాల సాస్ లను వేసి ఆ తర్వాత దానిని కూల్ చేస్తాడు.
ఆ తర్వాత కూడా మళ్లీ పైన ఐస్ క్రీమ్ ఉంచి దానిని చాక్లెట్ సాస్ అలాగే చాక్లెట్ ఫ్లెక్స్ లాంటిది పెట్టి సాస్ తో కలర్ ఫుల్ గా డెకరేషన్ చేసి ఇస్తాడు.దీంతో చల్లగా, తీయగా ఉండే ఐస్ క్రీమ్ బర్గర్( Ice Cream Burger ) రెడీ అవుతుంది.
ఈ వీడియోని చూసిన ఆహార ప్రియులు రకరకాలుగా వారి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం వైరల్ బర్గర్ వీడియోని చూసి మీకు కూడా ఎలా అనిపించిందో ఓసారి తెలపండి.







