Anand Mahindra Viral Video : వైరల్ వీడియో: ఇలా అయితే భవిష్యత్తు ఓ పీడకలే అంటున్న ఆనంద్ మహేంద్ర..!

ప్రస్తుత కాలంలో ప్రతిరోజు టెక్నాలజీలో( Technology ) అనేక మార్పులు సంభవిస్తూనే ఉంటాయి.వీటిలో చాలావరకు మనుషులు ఉపయోగించే ఆవిష్కరణలు ఎక్కువగా ఉంటాయి.

 Anand Mahindra Tweet Viral On Technology In Future Viral Video-TeluguStop.com

ఇందులో సాంకేతికంగా మనుషులకు కొన్ని బాగా పనికొస్తున్న మరికొన్ని మాత్రం మనుషులను బాగా సోమరులుగా తయారు చేసే విధంగా కూడా ఉంటాయి.ఇలాంటి వాటితో భవిష్యత్తులో అనర్థాలు తప్పవని తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర( Anand Mahindra ) తెలిపారు.

ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీల వల్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందంటూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.

తాజాగా ఆనంద్ మహేంద్ర షేర్ చేసిన వీడియోలో.ఓ యువకుడు షాపింగ్ మాల్ లో ఒక చేత్తో పాప్ కార్న్, మరో చేత్తో కూల్ డ్రింక్ పట్టుకొని ఒక్క వీల్ మాత్రమే ఉన్న ఏఐ స్కూటర్ పై( AI Scooter ) వేలాడుతూ కనపడతాడు.అంతే కాదండి.

ఆ అబ్బాయి ఆయన కళ్ళకి విజన్ ప్రో( Vision Pro ) అద్దాలు అలాగే అతను కూర్చొని ఉన్న స్కూటర్ పై రెండు స్మార్ట్ ఫోన్లు ఉండడం మనం గమనించవచ్చు.ఈ వీడియో చూస్తూ తాము టెక్నాలజీతో పూర్తిగా కనెక్ట్ అయిపోయామని దాంతో వాస్తవిక జీవితాన్ని డిస్కనెక్ట్ అయిపోతున్నామంటూ ఆనంద మహేంద్ర తెలియజేశారు.

ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు( Future ) మాత్రం పీడకల గానే మారిపోతుందంటూ ఆయన తెలియ చేశారు.ఈ వీడియోను చూసి నెటిజన్లు కూడా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.వీరిలో చాలామంది మహేంద్ర అభిప్రాయంతో ఏకీభవిస్తూ వారి అభిప్రాయాన్ని కూడా తెలుపుతున్నారు.ముఖ్యంగా ఇలా టెక్నాలజీ పెరగడం కారణంగా అనేకమంది తమ బాల్యాన్ని సరిగా ఆస్వాదించడం లేదంటూ తెలపగా.

, మరికొందరైతే రాబోయే రోజుల్లో మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకొలేని పరిస్థితి కూడా రాబోతోంది అంటూ కామెంట్లు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube