గత కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు( Mega Brother Naga Babu ) రాజకీయంగా సైలెంట్ అయిపోయారు.జనసేనలో యాక్టివ్ గా ఉంటూ.
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయ బాధ్యతలను నాగబాబు చూస్తున్నారు. సోషల్ మీడియా( Social media ) ద్వారా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తూ ఉంటారు.
ఎంపీ గా పోటీ చేసి లోక్ సభలో అడుగు పెట్టాలని నాగబాబు చాలాకాలంగా ఆశలు పెట్టుకున్నారు.ఈ మేరకు అనకాపల్లి ఎంపీగా జనసేన నుంచి పోటీ చేయాలని భావించారు.
అయితే నాగబాబు ఆశలు తీరేలా కనిపించడం లేదు.టిడిపి, బిజెపి, జనసేన పొత్తు( BJP TDP Janasena Alliance )లో భాగంగా అనకాపల్లి సీటును బిజెపికి కేటాయించే అవకాశం ఉండడంతో నాగబాబు ఆశ తీరేలా కనిపించడం లేదు.
గత కొంతకాలంగా అనకాపల్లి నుంచే పోటీ చేసే ఆలోచనతో ఉన్న నాగబాబు ఆ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రివ్యూలు నిర్వహిస్తున్నారు.
ఎక్కువగా అక్కడే మకాం వేసి పార్టీ పరిస్థితులను చక్కదిద్దుతూ, అక్కడే తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు.అయితే ఇప్పుడు నాగబాబు పూర్తిగా సైలెంట్ అయిపోయారు.ఆయనకు ఎంపీగా అవకాశం లేదనే విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది.
టిడిపి తో పొత్తులో భాగంగా మూడు ఎంపీ సీట్లను టిడిపి కేటాయించింది.అయితే ఇప్పుడు బిజెపి కూడా పొత్తు పెట్టుకోవడంతో, జనసేన ఒక సీటును త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే నాగబాబు అసెంబ్లీ కి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగబాబుకు టికెట్ దక్కడం అనుమానంగానే ఉంది.
టిడిపి, జనసేన కూటమిలో భాగంగా జనసేన ఆశించిన దానికంటే బాగా తక్కువ సీట్లను టిడిపి కేటాయించడంపై నాగబాబు చాలా అసంతృప్తితోనే ఉంటూ వస్తున్నారు.ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు దూరమయ్యే అవకాశం ఉండడం వంటివి నాగబాబులో మరింత అసంతృప్తిని కలిగిస్తున్నాయి.కాకపోతే పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాని కే నాగబాబు పరిమితం కావచ్చు.