యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభ వేడుకలకు సోమవారం హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,కొండా సురేఖ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆలయ అధికారులు ఘోర అవమానానికి గురిచేశారు.
సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు ఉత్తమ్,కోమటిరెడ్డి లను పెద్ద పీటలో కూర్చోబెట్టి ఆశీర్వచనం చేసిన ఆలయ అర్చకులు,భట్టి,కొండా సురేఖ లను నేలపై కూర్చోబెట్టారు.ప్రోటోకాల్ ప్రకారం సిఎం డిఫ్యూటీ సీఎం,దేవాదాయ శాఖ మంత్రి,ఆ తర్వాత ఇతర మంత్రులకు అవకాశం ఉంటుంది.
కానీ,ఆలయ అధికారులు డిఫ్యూటీ సీఎం,ఆ శాఖా మహిళా మంత్రిని కింద కూర్చోబెట్టి,మిగతా మంత్రులకు పీటలు వేయడం విమర్శలకు దారితీసింది.ఆలయ అధికారుల వైఖరిపై మంత్రుల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.







