Pawan Kalyan : విజయవాడలో బీజేపీ నేతలతో పవన్ సమావేశం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో జనసేన-బీజేపీ-టీడీపీ పార్టీలు( Janasena BJP TDP ) కలసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.ఏపీలో ఎన్నికలకు ఇంక 40 రోజులు మాత్రమే సమయం ఉంది.దీంతో ఈసారి ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.2014 ఎన్నికల మాదిరిగా ఈసారి కూటమి ఏర్పడటంతో.రాష్ట్రంలో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది.రెండు రోజుల కిందట ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చంద్రబాబు( Chandrababu ) మరియు పవన్( Pawan Kalyan ) సమావేశం అయ్యారు.

 Pawan Kalyan Meeting With Bjp Leaders In Vijayawada-TeluguStop.com

ఈ క్రమంలో పొత్తు కుదుర్చుకొని శనివారం రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది.ఇక ఆదివారం వచ్చేసరికి విజయవాడలో బీజేపీ నాయకులతో( BJP Leaders ) పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

పొత్తు కుదిరిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.విజయవాడలో( Vijayawada ) జరిగిన ఈ సమావేశానికి బీజేపీ నుంచి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకవత్( Gajendra Singh Shekhawat ) పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి( Daggubati Purandeshwari ) హాజరయ్యారు.రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేసే స్థానాలపై చర్చలు జరపడం జరిగింది.ఈ క్రమంలో లోక్ సభ మరియు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై విరుపార్టీల నేతలు సమాలోచనలు చేశారు.

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు 25 లోక్ సభ స్థానాలు ఉండగా…బీజేపీ – జనసేనా పార్టీలకు 30 అసెంబ్లీ స్థానాలు 8 ఎంపీ స్థానాలు చంద్రబాబు కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి.దీంతో 2024 ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా.

విపక్ష నేతలు జాగ్రత్త పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube