2024 ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి పార్టీకి ప్రతి ఓటు కీలకం కానుంది.వైసీపీ, టీడీపీ ,జనసేన, బీజేపీ ( YCP, TDP, Jana Sena, BJP )కూటమి పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి.
కొన్ని స్థానాలు మినహా మెజారిటీ స్థానాలలో పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఫిక్స్ అయ్యారు.ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఎవరు గెలుస్తారనే బెట్టింగ్ లు కూడా నడుస్తున్నాయి.
ఒక ప్రధాన పార్టీ 100 స్థానాల్లో గెలుస్తుందని బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్ కాస్తున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన బీజేపీ ఎన్నికల్లో పోటీ పడనుండగా వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం టీడీపీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వైసీపీ ఓడిపోయినా టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలుపును నైతిక విజయం అని అంటారా? అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి.మరోవైపు బీజేపీతో పొత్తు టీడీపీ జనసేనలకు మేలు కంటే కీడు చేసే ఛాన్స్ ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

జగన్( jagan ) పార్టీని గెలిపించుకుంటే రాష్ట్రంలో టీడీపీ పుంజుకోవడం మాత్రం జరగదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన రాష్ట్రానికి బీజేపీ నుంచి ఎలాంటి హామీలను ఇప్పిస్తుందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.బీజేపీ వల్లే ప్రత్యేక హోదా రాలేదని ప్రత్యేక హోదా ఇప్పించగల సామర్థ్యం టీడీపీ, జనసేనలకు ఉందా అని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ జనసేన బీజేపీ పొత్తు నేపథ్యంలో రెబల్స్ రూపంలో ఈ పార్టీలకు ప్రమాదం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాజకీయాల్లో 1+1 2 కాదని పొత్తులు కచ్చితంగా మేలు చేస్తాయని చెప్పలేమని విశ్లేషకులు చెబుతున్నారు.2014 మ్యాజిక్ ను రిపీట్ చేయడం తేలిక కాదని అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.2024 ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు భారీ స్థాయిలో ఖర్చు చేయబోతున్నాయని తెలుస్తోంది.







