వీధుల్లో పారుతున్న మురుగు నీరు...!

యాదాద్రి భువనగిరి జిల్లా:గుండాలGundala ) మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బాత్రూం,లెట్రిన్,ఇతర అవసరాలకు ఇళ్లలో వాడుకున్న నీళ్లు రోడ్లపైకి చేరుకొని ఏరులై పారుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనితో గ్రామంలో పారిశుద్ధ్య లోపం ఏర్పడి,దోమల బెడద పెరిగిందని,ఇది చాలదన్నట్లు ప్రజల మధ్య గొడవలు జరుగుతున్నాయని వాపోయారు.

 Sewage Flowing In The Streets...!-TeluguStop.com

ఇంకుడు గుంతలపై గ్రామాల్లో సరైన అవగాహన లేక ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని,సమస్యను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక ( Panchayat Secretary Priyanka )దృష్టికి తీసుకెళ్లి15 రోజులు అవుతున్నాఎలాంటి స్పందన లేదని,ప్రత్యేక అధికారి పాలనలోప్రజల సమస్యలు పేరుకు పోతున్నాయని బండారు వెంకటేష్,ఊట్ల విజయ ఆరోపించారు.ఈమురుగు నీరు దుర్వాసనతో అంటు రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని,తక్షణమే అధికారులు స్పందించి పరిష్కార మార్గం చూపించాలన్నారు.

స్థానిక కార్యదర్శి ప్రియాంకను చరవాణిలో వివరణ కోరగా స్థానిక ప్రజలు సహకరించకపోవడం వల్లనే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని,ఈ విషయాన్ని ఎంపీడీవోకి వివరించామని,త్వరలో గ్రామసభ పెట్టి సమస్యను పరిష్కార మార్గం చేస్తామని తెలిపారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube