కాంట్రవర్సీ( Controversy ) ఉన్న సినిమా తీస్తే కాసుల పంట కురవడం ఖాయం అనే నమ్ముతున్నారు ఇప్పటి తరం దర్శక నిర్మాతలు.ఉన్న ఆ కాస్త కాంట్రవర్సీకి స్టార్ కాస్టింగ్ తోడు చేసి విడుదల చేస్తే ఇక వెనక తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు ఆ సినిమా ఆటోమేటిక్ గా బ్లాక్ బాస్టర్ వసూళ్లను సాధిస్తుంది.
ఇదే మంత్రాన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి మూడు సినిమాలు.అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి విడుదల వరకు కాంట్రవర్సీ నడుస్తూ ప్రేక్షకులలో ఆసాంతం క్రేజ్ పెంచుతూ విడుదలకు సిద్ధమైన ఆ మూడు సినిమాలు ఏంటి వాటి వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయాలను ఈ ఆర్థికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రజాకార్( Razakar )
మరుగున పడి ఉన్న చరిత్రను చూపిస్తున్నాం అంటూ వివాదాల్లో వేలు పెడుతూ మార్చ్ 15న వస్తోంది రజాకార్ చిత్రం( Razakar ).ఈ సినిమాలో అనసూయ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది.రజాకర్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి అసలు కాంట్రవర్సీ మొదలైంది.ఈ చిత్రంలో ముస్లింల పట్ల చాలా వివక్ష జరిగింది అంటూ చాలామంది గగ్గోలు పెడుతున్నారు.మరి ఈ సినిమా విడుదలయ్యాక మరింత వివాదం చెలరేగుతుందా ఏంటో చూడాలి.
బస్తర్( Bastar )
సుదీప్తో సేన్ ఇప్పటికే కేరళ స్టోరీస్( Kerala Story ) వంటి ఒక కాంట్రవర్షల్ సినిమాను విడుదల చేసి 250 కోట్ల రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టాడు.కొన్నేళ్ల క్రితం బస్తర్( Bastar ) జిల్లాలో నక్సలైట్ల దాడిలో దాదాపు 76 కి పైగా జవాన్లు అమరులయ్యారు.ఈ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే మరో కాంట్రవర్సీకి అందరు సిద్ధంగా ఉండాలని హింట్ ఇచ్చినట్టుగా ఉంది.ఈ సినిమా కూడా మార్చి 15న విడుదల కానుంది.
వీర్ సావర్కర్( Veer Savarkar )
స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరైన వినాయక దామోదర్ సావర్కర్ జీవిత కథ ను ఆధారంగా చేసుకొని రణదీప్ హుడా వీర్ సావర్కర్( Veer Savarkar ) అనే పేరుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు.టైటిల్ పాత్రలో ఆయనే స్వయంగా నటిస్తున్నారు.22న ఈ సినిమా విడుదల కానుంది.