Chiranjeevi Surekha : నా భర్త పచ్చడి మెతుకులైనా తింటారు.. చిరంజీవి భార్య ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ క్యూట్ కపుల్ మెగాస్టార్ చిరంజీవి కొణిదెల సురేఖ( Megastar Chiranjeevi Konidela Surekha ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు.

 Konidela Surekha About Chiranjeevi Food Habits-TeluguStop.com

అయితే సురేఖ చాలా వరకు సినిమా ఇండస్ట్రీకి అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు.కేవలం పండుగ ఈవెంట్లలో మాత్రమే అలా కనిపిస్తూ ఉంటారు.

ఇకపోతే తాజాగా ఉమెన్స్ డే( Womens Day ) సందర్భంగా ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భర్త గురించి అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో విషయాల గురించి స్పందించింది.ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.

చిరంజీవిగారు భోజనం విషయంలో అసలు ఆలోచించారు.ఏది పెట్టినా తినేస్తారు.

Telugu Chiranjeevi, Konidelasurekha-Movie

చివరకు పచ్చడి అన్నం పెట్టినా మాట్లాడకుండా తృప్తిగా తింటారు.నాగబాబు( Nagababu )కు అలా కాదు.అన్ని రుచులు కావాలి. కళ్యాణ్‌ బాబు( Pawan Kalyan )ది వాళ్ల అన్నయ్య వరసే.ఎటువంటి డిమాండ్లూ ఉండవు.ఏది పెట్టినా తినేస్తాడు.

ఇక్కడ ఒక విషయం తప్పనిసరిగా చెప్పాలి.మామయ్య గారు చక్కగా తినేవారు.

ఆయన తినటం చూస్తే మిగిలిన వాళ్లకు కూడా తినాలనిపిస్తుంది.అదొక కళ.అమ్మ నాకు చిన్నప్పటి నుంచి, అందరికీ పెట్టడం నేర్పింది.ఎవరైనా తృప్తిగా తింటుంటే ఇంకా పెట్టాలని అపిస్తుంటుంది తినేవాళ్లకు పెట్టడంలో లభించే తృప్తి వేరు అని తెలిపింది సురేఖ.

అయితే పెళ్లికి ముందు వంట అసలు రాదని చెప్పిన ఆమె ఇప్పుడు వంట చేయడంలో పర్ఫెక్ట్‌ అని అన్నారు.

Telugu Chiranjeevi, Konidelasurekha-Movie

మా అమ్మ వాళ్లింట్లో నేనే చిన్నదాన్ని.కూరలు తరగటం లాంటి చిన్న చిన్న సాయాలు చేయటం తప్ప వండటం రాదు.పెళ్లి అయిన తర్వాత అన్నీ నేర్చుకున్నాను.

ఇక్కడ మీకో రహస్యం చెబుతాను.వంటలో నాకు గురువు- మా ఆయనే.

మామయ్యగారు భోజన ప్రియులు.మా అత్తయ్యగారు చాలా బాగా వండుతారు.

దాంతో ఆయన చిన్నప్పుడు రకరకాల వంటలు వండేవారట.మాకు పెళ్లైన కొత్తల్లో– అత్తమ్మ లాగ నేను కూడా వంటచేేస్త బావుండునని ఆయనకు ఉండేది.

కానీ నాకు రాదు.కాపురానికి వెళ్లిన తర్వాత- ఒక రోజు ఉప్మా చేశా.

ఉండలు ఉండలుగా వచ్చింది.అప్పటిదాకా ఉప్మా అలాగే చేస్తారనుకొనేదాన్ని.

ఆ తర్వాత ఆయనే నాకు ఉప్మా( Upma ) చేయటం, ఇతర వంటలు వండటం నేర్పారు అని నవ్వుతూ చెప్పుకొచ్చింది సురేఖ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube