Srijita : సినిమా ఆఫర్ కోసం వెళ్తే డైరెక్టర్ అలాంటి పాడుపని.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!

క్యాస్టింగ్ కౌచ్‌( Casting couch ).ఈ పదం అన్ని రంగాలలోనూ వినిపిస్తూ ఉంటుంది.

 Bigg Boss Beauty Sreejita De Shares Shocking Casting Couch Experience-TeluguStop.com

అయితే ఇతర రంగాలతో పోల్చుకుంటే సినిమా రంగంలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.రంగుల ప్రపంచం లాంటి సినిమా రంగంలో ఇది సర్వ సాధారణంగా మారిపోయింది.

గతంలో చాలామంది హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన విషయం తెలిసిందే.అయితే కొందరికి హీరోయిన్లు ధైర్యంగా ఈ విషయం గురించి స్పందించగా మరికొందరు నోరు విప్పితే అవకాశాలు రావేమో అన్న భయంతో ఇప్పటికి చాలామంది వెనుకడుతున్నారు.

గతంలో చాలామంది హీరోయిన్లు ఈ క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన విషయం తెలిసిందే.

Telugu Bigg Boss, Biggboss, Coutch-Movie

తాజాగా కూడా మరొక నటి తనకు ఎదురైనా క్యాస్టింగ్ కౌచ్‌ అనుభవాల గురించి చెప్పకొచ్చింది.ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ -16 కంటెస్టెంట్ శ్రీజిత( Srijita ).ఈమె తాజాగా సినీ రంగంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వివరించింది.ఒక సినిమా ఆఫర్ కోసం వెళ్తే డైరెక్టర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది.తాజాగా ఒక ఛానెల్‌కు ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.కాగా ఈ సందర్బంగా శ్రీజిత మాట్లాడుతూ.నేను 17 ఏళ్ల వయసు లోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టాను.

మాది పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా( Haldia ) అనే చిన్న పట్టణం.మా అమ్మ ఎల్లప్పుడూ నాకు మద్దతుగా ఉంటూ నాతోనే ఉండేది.

Telugu Bigg Boss, Biggboss, Coutch-Movie

మా అమ్మ దగ్గర ఏ విషయాన్ని కూడా దాచేదాన్ని కాదు.కానీ అనుకోకుండా ఇండస్ట్రీలో కొందరు చెత్త వ్యక్తులను కూడా కలిశాను.కొందరు ప్రాజెక్ట్ లేకపోయినా కేవలం మీటింగ్‌ కోసం పిలిచి టైం పాస్ చేసేవారు.మరికొందరు పెద్ద డైరెక్టర్‌తో సినిమా ఉందంటూ కమిట్‌మెంట్‌ అడిగేవారు.అలా రెండుసార్లు ఇలాంటి అనుభవం ఎదురైంది అని చెప్పుకొచ్చింది.కానీ ఒకసారి చాలా భయంకరమైన పరిస్థితి నుంచి బయపడ్డానని తెలిపింది.

నాకు 19 ఏళ్ల వయస్సులో హిందీ చిత్రం రీమేక్ ఆఫర్ వచ్చింది.డైరెక్టర్ నన్ను సమావేశానికి పిలిచారు.ఆ సమయంలో మా అమ్మ కోల్‌కతాలో ఉంది.నేను ఒంటరిగా డైరెక్టర్ ఆఫీసుకి వెళ్లాను.అతను నా భుజం పట్టుకున్న విధానం, నాతో మాట్లాడే విధానం నాకు నచ్చలేదు.అతను వయసులో చాలా పెద్దవారు.

ఎలాంటి వారికైనా ఆయన బుద్ధి ఎలాంటిదో వెంటనే అర్థమైపోతుంది.అతను నన్ను చూస్తున్న తీరు చాలా అసహ్యంగా అనిపించింది.

దీంతో వెంటనే నా పర్సు తీసుకుని ఆఫీసు నుంచి బయటికి పరిగెత్తా అంటూ ఆ షాకింగ్ సంఘటనను వివరించింది.కానీ క్యాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో ఎప్పుడు మోసపోలేదని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube