అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘‘నాసా’’లో( NASA ) కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ సహా ఎంతోమంది భారత సంతతి వ్యోమగాములు పనిచేసి దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టారు.వీరు చూపిన బాటలో ఎంతోమంతి ప్రవాస భారతీయులు నాసాలో వ్యోమగాములుగా చేరి రాణిస్తున్నారు.
తాజాగా డెమో 2 మిషన్ సమయంలో అంతరిక్షంలో మనిషిని ప్రవేశపెట్టడానికి సహాయపడిన ‘‘ స్పేస్ ఎక్స్ ’’ మొదటి ఫ్లైట్ సర్జన్ డాక్టర్ అనిల్ మీనన్( Dr.Anil Menon ) మరో 9 మందితో కలిసి నాసా వ్యోమగామిగా పట్టుభద్రుడయ్యారు.
‘‘ ది ఫ్లైస్ ’’ అనే మారు పేరుతో మార్చి 5న హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఈ బృందం భవిష్యత్తులో.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, కక్ష్యలో వున్న గమ్యస్థానాలు, చంద్రుడు తదితర యాత్రలకు అర్హత పొందింది.2021లో శిక్షణ కోసం ఎంపికైన అనిల్ మీనన్.వ్యోమగామి గ్రాడ్యుయేషన్( Astronaut Graduation ) కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 12 వేల మందిని వెనక్కినెట్టి షార్ట్ లిస్ట్ అయ్యారు.
స్పేస్ వాకింగ్, రోబోటిక్స్, స్పేస్ స్టేషన్ సిస్టమ్‌లు, మరిన్నింటితో సహా అవసరమైన రెండేళ్లకు పైగా ప్రాథమిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు.

దశాబ్ధాలుగా మన సాహసోపేత వ్యోమగాముల కారణంగా అమెరికా .( America ) అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచాన్ని నడిపిస్తోందని ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు.నేషనల్ స్పేస్ కౌన్సిల్ చైర్‌గా నాసా ఆస్ట్రోనాట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న పది మందిని ఆమె అభినందించారు.
వారి సంకల్పం, అద్భుతమైన నైపుణ్యం, శిక్షణ .విశ్వంపై మన అవగాహనను మరింత విస్తరించడంలో సహాయపడతాయని కమలా హారిస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

నాసాకు ఎంపిక కావడానికి ముందు.అనిల్ మీనన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో( International Space Station ) వివిధ సాహస యాత్రలకు క్రూ ఫ్లైట్ సర్జన్‌గా పనిచేశారు.ఏరోస్పేస్ మెడిసిన్‌లో ఫెలోషిప్ శిక్షణతో చురుగ్గా ప్రాక్టీస్ చేస్తున్న అనిల్.వైద్యుడిగా 2010లో హైతీలో సంభవించిన భూకంపం, 2015లో నేపాల్‌లో సంభవించిన భూకంపం, 2011లో రెనో ఎయిర్ షో ప్రమాదం సందర్భంగా హుటాహుటిన స్పందించారు.







