సాధారణంగా కొన్ని ప్రమాదాలు ఎటువైపు నుంచి ఎలా వస్తాయో చెప్పలేని పరిస్థితి.ముఖ్యంగా వృద్ధులకు! వృద్ధులు వెంటనే ప్రమాదాల నుంచి తప్పించుకోలేరు, పరిసరాల పట్ల ప్రమాదంగా ఉండలేరు కాబట్టి వారికి ఎక్కువ ప్రాణాపాయం ఉంటుంది.
తాజాగా యూకేలోని టోంటెగ్ గ్రామంలో అన్నే హ్యూస్( Hughes ) అనే 72 ఏళ్ల వృద్ధురాలు అనుకోకుండా ఒక ప్రమాదంలో చిక్కుకుంది.ఈ ఈవెంట్ బెస్ట్ వన్ అనే లోకల్ స్టోర్ వెలుపల జరిగింది.
అనుకోని సంఘటన జరిగినప్పుడు హ్యూస్ దుకాణం ఓపెన్ రావడం కోసం అక్కడే నిల్చొని వెయిట్ చేస్తోంది.స్టోర్‌ను రక్షించడానికి ఉద్దేశించిన స్టోర్ ఎలక్ట్రిక్ సెక్యూరిటీ షట్టర్లు( Store electric security shutters ), అనుకోకుండా ఆమె జాకెట్ వెనుకకు తగులుకుంది.
దానివల్ల హ్యూస్ నేలపై నుంచి గాలిలోకి లేచింది.

ఈ దుకాణంలో క్లీనర్‌గా పనిచేస్తున్న హ్యూస్ ఒక్కసారిగా తలకిందులుగా వేలాడింది.ఆమె తన షాపింగ్ ట్రాలీ బ్యాగ్‌ని గట్టిగా పట్టుకుంది.కానీ షట్టర్ ట్రాలీ బ్యాగ్‌ని కూడా సింపుల్‌గా పైకి ఎత్తేసింది.
సుమారు 12 సెకన్ల పాటు ఈ భయానక, అసాధారణ స్థితిలో ఆమె ఉండిపోయింది.అదృష్టవశాత్తూ, ఒక స్టోర్ ఉద్యోగి ఏమి జరుగుతుందో చూసి త్వరగా చర్య తీసుకున్నాడు.
ఉద్యోగి బయటికి వెళ్లి హ్యూస్ సురక్షితంగా నేలపైకి రావడానికి సహాయం చేశాడు.అతడు వేగంగా స్పందించడం వల్ల హ్యూస్ ఈ వింత సంఘటన నుంచి గాయపడకుండా బయటపడింది.

దుకాణంలోని సెక్యూరిటీ కెమెరాలు ఈ మొత్తం దృశ్యాలను రికార్డు చేశాయి.హ్యూస్ షట్టర్‌కు వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.చాలా మంది దీనిని చూసి షాక్ అయ్యారు.అయితే ఈ వృద్ధురాలు ధైర్యంగా ఉంది.పరిస్థితి గురించి ఒక జోక్ కూడా చేసింది.ఈ వీడియోను చాలా మంది చూసారు కాబట్టి తాను ఫేమస్ అవ్వడం అలవాటు చేసుకోవాలని చెప్పింది.
సంఘటన తర్వాత హ్యూస్ క్షేమంగా ఉందని, ఎటువంటి గాయాలు లేవు అని అధికారులు తెలిపారు.కోటు బలంగా ఉందని, చిరిగిపోనందుకు సంతోషంగా ఫీలవుతున్నానని చెప్పింది.
కోటు చిరిగిపోతే ఆమె ముఖం మీద కింద పడిపోయి ఉండేది దానివల్ల చాలా పెద్ద గాయం అయి ఉండేది.







