సాహితి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్( Sahithi Infra Private Limited )కు సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు.ఈ మేరకు రూ.200 కోట్ల విలువైన ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు.ఈ క్రమంలోనే సాహితి పార్ట్ నర్స్, ఉద్యోగులను విచారిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు( Telugu States ) చెందిన కీలక నేతలు ఈ వ్యవహారంలో ఉన్నారని భావిస్తున్న పోలీసులు కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.రాజకీయ నేతలతో పాటు బడా వ్యాపారుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన సాహితి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ లక్ష్మీనారాయణ( Sahithi Infra Pvt td MD Lakshminarayana ) కోసం సీసీఎస్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.







