Ravichandran Ashwin : భారత్ తరపున అశ్విన్ తో పాటు 100 టెస్టులు ఆడిన భారత క్రికెటర్లు వీరే..!

భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్( India vs England ) మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా నేడు ధర్మశాల వేదికగా జరిగే ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచ్ భారత జట్టు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు( Ravichandran Ashwin ) 100వ టెస్టు మ్యాచ్.

 Along With Ashwin These Are The Indian Cricketers Who Have Played 100 Tests For-TeluguStop.com

మ్యాచ్ ప్రారంభం కాకముందు నిర్వహించిన కార్యక్రమంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చేతుల మీదుగా రవిచంద్రన్ అశ్విన్ ప్రత్యేక క్యాప్ అందుకున్నాడు.

రవిచంద్రన్ అశ్విన్ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా తన భార్య, పిల్లలతో ఉండడం విశేషం.ఇక టెస్ట్ మ్యాచ్ ఆడే భారత జట్టు సభ్యులంతా రవిచంద్రన్ అశ్విన్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.భారత్ తరపున ఇప్పటివరకు ఏకంగా 14 మంది ఆటగాళ్లు 100 టెస్ట్ మ్యాచ్లు ఆడారు.

సచిన్ టెండుల్కర్,( Sachin Tendulkar ) సునీల్ గవాస్కర్,( Sunil Gavaskar ) కపిల్ దేవ్,( Kapil Dev ) వెంగ్సర్కార్, వీరేంద్ర సెహ్వాగ్, లక్ష్మణ, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, పుజార, విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, సౌరబ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 100 టెస్ట్ మ్యాచ్లు పూర్తి చేసుకున్నారు.

మహేంద్ర సింగ్ ధోని 99 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు.ఇక భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్ 3-1 తేడాతో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.ధర్మశాల వేదికగా జరుగుతున్న 5వ మ్యాచ్లో విజయం సాధించి తన పరువు నిలుపుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.

భారత్ 4-1 తేడాతో ఈ సిరీస్ లో విజయం సాధించాలని బరిలోకి దిగింది.కర్ణాటక ఆటగాడైన దేవదత్ పడిక్కల్ భారత్ తరపున నేడు జరిగే మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube