టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ రోలర్ రఘు( Comedian Roller Raghu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో విలన్ గా కమిడియన్ గా నటించి మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు.
నటనకు కొద్దిగా బ్రేక్ ఇచ్చిన ఆయన అదుర్స్, లక్ష్మి, కిక్, నాయక్, ఊసరవెల్లి వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో అలరించారు.మంచి కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రఘు దాదాపు 150 చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు.
ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్ల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.

ఇది ఇలా ఉంటే ఇటీవలే తాజాగా కమెడియన్ రోలర్ రఘు చేసిన వాఖ్యలు సోషల్ మీడియా వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.నేను పొద్దున్నే టై కట్టుకుంటే సాఫ్ట్ వేర్ హడావుడి.
ది అంగ్రేజ్,( The Angrez ) హైదరాబాద్ నవాబ్స్( Hyderabad Nawabs ) సినిమాతో విదేశాల్లోనూ పాపులరయ్యాను.తెలుగులో ఆ మైలేజ్ రాలేదు.నాకు నటనరాదు బిహేవ్ చేయడమే తెలుసు.ఏవీ కాలేజ్ బీఏ ఆఫీస్ మేనేజ్మెంట్ కోర్సులో సీఎం రేవంత్,( CM Revanth Reddy ) నేనూ క్లాస్ మేట్స్ అంటున్నారు ప్రముఖ సినీ హాస్యనటుడు రఘు కారుమంచి.

ఈ శనివారం రాత్రి 9.గంటలకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ న్యూస్ ఛానెల్స్ చెప్పాలని ఉంది అభి రఘు పంచుకున్న మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ నేను తెలంగాణ సీఎం ఇద్దరు క్లాస్మేట్స్ అంటూ అటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ షోలో ఇంకా ఎన్నో రకాల విషయాలను పంచుకున్నారు రఘు







