Transgender Love Story : మీ ప్రేమ తగలెయ్య: ప్రేమించుకున్న ఇద్దరు అబ్బాయిలు.. ప్రేమికుడి కోసం లింగమార్పిడి చేసుకున్న యువకుడు.. చివరికి..?!

తాజాగా వెలుగులోకి వచ్చిన ఇద్దరి యువకుల ప్రేమ సంగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.యువకులలో ఒకరు ప్రేమించిన వాడి కోసం ఏకంగా లింగమార్పిడి( Transgender ) చేయించుకున్న తర్వాత.

 Transgender Burnt Car With Petrol After Boyfriend Denied To Marriage In Uttar P-TeluguStop.com

ఆ అబ్బాయి చిక్కుల్లో పడిన సంఘటన తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో( Uttar Pradesh ) వెలుగులోకి వచ్చింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

విదేశాల్లో ఉండే పరసంస్కృతి రానురాను భారతదేశంలో కూడా పెరిగిపోతోంది.ఇద్దరు యువకులు, ఇద్దరమ్మాయిలు ప్రేమించుకోవడం లాంటి సంఘటనలు ఇప్పుడు భారతదేశంలో కూడా కామన్ గా మారిపోయాయి.

అయితే తాజాగా ఇండోర్, కాన్పూర్ ప్రాంతాలకు చెందిన ఇద్దరు అబ్బాయిలు( Two Boys ) గడిచిన కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని ఒకరినొకరు ఇష్టపడ్డారు.ఈ కార్యక్రమంలో వారిద్దరు పెళ్లి చేసుకుని ఒకటి కావాలని కూడా భావించారు.అందులో ఒక అబ్బాయి ఏకంగా మరో అబ్బాయి కోసం కోటి రూపాయల వరకు ఖర్చు చేసి లింగమార్పిడి కూడా చేయించుకున్నాడు.ఇంతవరకు బాగున్న ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.

లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తిని పెళ్లి( Marriage ) చేసుకోవడానికి నిరాకరించాడు మరో అబ్బాయి.

ఈ సంఘటనతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాధిత యువకుడు మరో యువకుడి కారుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి రికార్డు అయిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ వీడియోలో లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి రెండు లీటర్ల బాటిల్ తో పెట్రోల్ తీసుకుని వచ్చి బాధిత యువకుడి కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

దీంతో బాధ్యత యువకుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో అసలు విషయం కాస్త బయటకు వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube