Tonique Businesses : టానిక్ వ్యాపారాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్..!!

తెలంగాణలో టానిక్ నిర్వాహకుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.ఈ టానిక్ వ్యాపారాల( Tonic businesses ) వెనుక కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.

 Telangana Government Is Serious About Tonique Businesses-TeluguStop.com

గతంలోని బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వంలో పదవి అడ్డం పెట్టుకుని టానిక్ కు అనుమతులు తీసుకున్నారని జీఎస్టీ అధికారులు తెలిపారు.కాగా టానిక్ కోసం 2016లో గత ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది.

ప్రస్తుతం టానిక్ వైన్ షాపుకు ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు.అనిత్ రెడ్డి, కుప్పయ్యా భారతి, రాజ్ లక్ష్మణ్ రెడ్డి పేర్లతో టానిక్ వైన్ షాప్ నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే టానిక్ నిర్వాహకులు సుమారు రూ.100 కోట్ల ట్యాక్స్ ఎగవేశారని అధికారులు తెలిపారు.టానిక్ కు చెందిన ఎనిమిది దుకాణాల్లో విదేశీ మద్యం విక్రయాలు సాగుతున్నాయని.క్యూ బై టానిక్ పేరుతో మరో పదకొండు షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.అంతేకాకుండా టానిక్ వలన ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.కాగా ఈ టానిక్ సంస్థ వ్యాపారాలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా మండిపడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube