తెలంగాణలోని బీజేపీ లోక్ సభ సీట్ల ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతుంది.రెండో జాబితా ఇంకా కొలిక్కి రాకపోవడంతో అభ్యర్థులు తర్జన భర్జన పడుతున్నారని తెలుస్తోంది.
అటు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ( BJP Central Election Committee ) సమావేశం ఈ నెల 8వ తేదీకి వాయిదా పడింది.మరోవైపు మహబూబ్ నగర్ నియోజకవర్గ స్థానం కోసం నువ్వా -నేనా అన్న తరహాలో పోటీ నెలకొంది.
ఆ టికెట్ కోసం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ ( Jithender Reddy, dk aruna )పోటీ పడుతున్నారు.అలాగే మెదక్ టికెట్ విషయంలో సందిగ్ధత వీడలేదు.ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు( Soyam Bapu Rao )కు కూడా మొదటి జాబితాలో సీటు దక్కలేదన్న సంగతి తెలిసిందే.ఫస్ట్ లిస్టులో ప్రకటించిన అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
దీంతో రెండో జాబితాపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.