రకరకాల ఎన్నికల ప్రచారాలతో ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఎన్నికల సమయం సమీపించడంతో వినూత్నంగా ప్రయత్నిస్తూ, ప్రజల దృష్టి తమ పార్టీపై ఉండేలా చూసుకుంటున్నాయి.
అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యే విధంగా, వారి ఓట్లు తమ పార్టీకి పడే విధంగా చూసుకుంటున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ వైసిపి( YCP ) అన్ని వర్గాలు ప్రజలకు దగ్గరయ్యే విధంగా భారీ స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
దీనిలో భాగంగానే ఇప్పటికే భారీ స్థాయిలో నిర్వహిస్తున్న సిద్ధం సభలకు దీటుగా రాష్ట్రవ్యాప్తంగా నా కల పేరుతో జగన్( YS Jagan Mohan Reddy ) ఫోటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వినూత్న ప్రచారానికి తెరతీసింది.
పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సిద్ధం పేరుతో భారీ సభలను నిర్వహించింది.భీమిలి ఏలూరు( Eluru ) అనంతపురం లలో నిర్వహించిన ఈ సభలు సక్సెస్ కావడంతో అంతే ఉత్సాహంతో పల్నాడు జిల్లాలో సిద్ధం భారీ సభకు ప్లాన్ చేసింది .ఈ సభ కు 15 లక్షల మంది కార్యకర్తలు హాజరవుతారని వైసీపీ అంచనా వేస్తోంది.ఒకవైపు సిద్ధం సభలు నిర్వహిస్తూనే, భారీ ఎన్నిక ప్రచారానికి తెరతీసింది.
నాకు ఒక కల ఉంది పేరుతో ఒక కొత్త నినాదాన్ని వైసిపి సిద్ధం చేసింది.రాష్ట్రంలో ఇప్పటి వరకు జగన్ ఫోటోలతో సిద్ధం హార్డింగ్స్ ను భారీగా ఏర్పాటు చేయగా, దానికి ధీటు గా ‘ నాకు ఒక కల ఉంది ‘ పేరుతో రాష్ట్రంలోని ప్రతి నగరం, ప్రతి గ్రామం లో కార్మికులు తో, పిల్లలతో, అవ్వ తాతలతో , అక్క చెల్లెమ్మ లతో, రైతులతో జగన్ ఉన్న ఫోటోతో మీ కల నా కల అంటూ భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.మీ కల నా కల ప్రచారంలో మొత్తం ఆరు వర్గాల ప్రజలకు చెందిన హార్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు .వైసిపి ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్ లలో రైతుల కల జగనన్న కల, యువత కల జగనన్న కల, అక్కా చెల్లెమ్మల కల జగనన్న కల, కార్మికుల కల జగనన్న కల అంటూ భారీ ఫ్లెక్సీ లను వైసీపీ ఏర్పాటు చేస్తోంది.యువత, రైతులు వృద్ధలు , కార్మికులు, మహిళల సంక్షేమం కి వైసిపి అండగా ఉంటుందని అర్థం వచ్చే విధంగా ఈ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో జనాలను బాగానే ఇవి ఆకట్టుకుంటున్నాయి.