బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య,గృహజ్యోతి కింద జీరో కరెంట్ బిల్లులను లాంచనంగా ప్రారంభించిన ప్రజాప్రతినిధులు నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా: వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును మాట ఇచ్చి అందజేసిన ఘనత కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దైతే గృహ జ్యోతి పథకం కింద ఉచిత కరెంటు మాటఇచ్చి ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేనని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నరసయ్య అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గృహజ్యోతి కింద జీరో కరెంట్ బిల్లులను కొట్టి గన్న పెద్ద రాంరెడ్డి కి ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, ఎంపీటీసీ సభ్యురాలు ఎనుగందుల అనసూయ నర్సింలు , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డిలు కలిసి లాంచనంగా ప్రారంభంచి అందజేశారు.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.6 గ్యారంటీలలో నాలుగు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని మరో రెండు గ్యారెంటీలను కూడా అమలు చేసి తీరుతామని ఆయన చెప్పారు.శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను గెలిపించి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి అధికారంలోకి తెచ్చినట్లే రాబోవు పార్లమెంటు ఎన్నికలలో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి ఎంపీలను గెలిపించాలని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా గెలిపించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రం అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రానున్న పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాలకు 17 ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమిష్టి గా కృషిచేసి ప్రజలు గెలిపించాలని ఆయన కోరారు.సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది ఇప్పటికే ఇంటి ఇంటికి వెళ్లి జీరో విద్యుత్ బిల్లులను వినియోగదారులకు అందిస్తున్నామన్నారు.
రేషన్ కార్డు ఉండి ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకుని 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడితేనే ఇది వర్తిస్తుందని ఒకవేళ 201 యూనిట్లు దాటితే ఆ మొత్తానికి కరెంట్ బిల్ వేయడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా ఇంటి యజమాని గన్న పెద్దరాం రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగానే ఉచిత విద్యుత్తు ఇవ్వటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ జీరో కరెంట్ బిల్ వల్ల మా కుటుంబానికి నెలకు సుమారు 500 నుంచి 900 వరకు ఆదాయం మిగులుతుంది అని సంతోషం వ్యక్తం చేశారు.సెస్ ఎఈ పృద్వీధర్ మాట్లాడుతూ అలాగే గతంలో కూడా కరెంట్ బిల్లులు బకాయి ఉన్నా కూడా వాటికి ఈ పథకం వర్తించదన్నారు.
వాటిని పూర్తిగా కడితేనే ఈ గృహజ్యోతికి అర్హులన్నారు.అంటే మీరు గతంలో కరెంట్ బిల్లు కట్టకుండా ఉంటే మాత్రం వెంటనే ఆ బిల్లును క్లియర్ చేసుకోండి.లేదంటే జీరో బిల్లు బెనిఫిట్ మీకు రాదని ఆయన గుర్తు చేశారుకాంగ్రెస్ పార్టీ ఈ జీరో కరెంట్ బిల్ వల్ల మా కుటుంబానికి నెలకు సుమారు 500 నుంచి 900 వరకు ఆదాయం మిగులుతుంది అని సంతోషం వ్యక్తం చేశారు.సెస్ డి ఈ శ్రీనివాస్ , ఏఓ వెంకటేష్, జె ఏ ఓ సతీష్ , లైన్మెన్ లక్ష్మి రాజం, జెఏ పర్షరాములు , మాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య, కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి పేట పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె గౌస్ , గిరిధర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు బానోతు రాజు నాయక్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేశం, మల్లారెడ్డి , కుంబాల మల్లారెడ్డి , రఫీక్ , గుర్రం రాములు , పాతూరి భూపాల్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, అంజిరెడ్డి , ముచ్చ రాజిరెడ్డి , గోగూరి శ్రీనివాస్ రెడ్డి , అంతేర్పుల గోపాల్, పందిర్ల శ్రీ నివాస్ గౌడ్, తిరుపతి గౌడ్, పాశం నాగిరెడ్డి , కొత్త పల్లి దేవయ్య , గంట ఆంజనేయులు గౌడ్, గంట వెంకటేష్ గౌడ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి , పందిళ్ళ సుధాకర్ గౌడ్ , నర్రా భగవంత రెడ్డి ,రవి , కిషన్ , వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు
.






