Actress Shobha : 17 ఏళ్లకే నూరేళ్లు .. అవార్డు అందుకోవాల్సిన హీరోయిన్ ఉరి పోసుకుంది ..!

గతంలో నటి శోభ( Actress Shobha ) గురించి మనం అనేక ఆర్టికల్స్ లో చదువుకున్నాం.నిండా 17 ఏళ్లు నిండకుండానే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి.1962లో పుట్టిన ఈ అద్భుతమైన నటి కేవలం 15 ఏళ్ల వయసుకే ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.పెళ్లయ్యాక రెండేళ్ల కే ఎంతటి భారాన్ని మోయాల్సి వచ్చిందో లేదా ఇంకా ఏదైనా బాధ ఆమెను మింగేసిందో కానీ ఆ వయసులో ఎందుకు అలా ఆలోచించిందో ఎవరికి తెలియదు.1980లో శోభ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.పుట్టిన మూడేళ్ల నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన శోభ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్( A child artist ) గా నటిస్తూనే హీరోయిన్ అయింది.

 How We Lost Actress Sobha-TeluguStop.com

దాదాపు మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో 100 వరకు సినిమాల్లో నటించింది.ఆమె మాతృబాష మలయాళం అయినా కూడా చెన్నైలోనే ఎక్కువగా పెరిగింది.మొదట బాలనటిగా తమిళం నుంచి తెరంగేట్రం చేసింది.

Telugu Child Artist, Actress Shobha, Balu Mahendra, Actress Sobha, Manavuri, Nat

అతి తక్కువ వయసులో ఎక్కువ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన చాలా తక్కువ మంది హీరోయిన్స్ లలో శోభ ఉంటుంది.అప్పట్లో ఆమె సినిమా వస్తుంది అంటే ఆమె సమకాలీకులకు దడ పుట్టేది .తెలుగులో తరం మారింది, మన ఊరి పాండవులు( tharem marindi, mana vuri pandavulu ) అనే చిత్రాల్లో నటించింది.అయితే ఆమె జీవితం ఇప్పటికి ఒక మిస్టరీగానే ఉంది.ఎందుకు చనిపోయింది అనేదానికి చాలా కారణాలు ఉన్నాయి.ఇక శోభ తల్లి ప్రేమ కూడా నటిగా కొన్ని సినిమాల్లో నటించింది.ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో ప్రేమ చాలా మందికి తెలుసు.

అయితే ఆమె ఉరిపోసుకొని చనిపోవడం వెనక కారణం ఆమె తల్లి మరియు ఆమె భర్త దర్శకుడైన బాలు మహేంద్ర( Balu Mahendra ) పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి.నిజా నిజాలు దేవుడికే తెలియాలి.

ఒక అద్భుతమైన నటిని ఈ ప్రపంచం నుంచి తీసుకెళ్లడానికి కారణం మనుషులే అనేది జీర్ణించుకోలేని విషయం.

Telugu Child Artist, Actress Shobha, Balu Mahendra, Actress Sobha, Manavuri, Nat

17 ఏళ్ల వయసులోనే ఎంతో అనుభవం ఉన్న నటీమణిలా ఆమె నటించేది.ఆమె చివరిగా ఒక జాతీయ ఉత్తమ నటి పురస్కారం( National Best Actress Award ) అందుకోవాల్సింది.కుప్పమ్మ అనే ఒక చిత్రానికి ఆమెకు జాతీయ నటిగా అవార్డు ప్రకటించారు కానీ ఆమె అవార్డు అందుకోకుండానే కన్ను మూసింది.

ఆమె చనిపోయిన నాలుగేళ్లకు ఆమె తల్లి ప్రేమ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.ఈ తల్లి కూతుర్ల ఆత్మహత్య వెనక కారణాలు మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కానీ అతి చిన్న వయసులో ఎంతో అనుభవం ఉన్న నటిలా ఆమె నటించిన తీరు మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం.ఎన్నో విజయ శిఖరాలను ఎక్కిన ఆమె జీవితం మాత్రం ఒక విషాద కావ్యంలా మిగిలిపోయింది.

శోభ ఇప్పటికీ అప్పటికి ఎంతో మంది అభిమానులను పొందిన నటి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube