Black Face : ఎండల దెబ్బకు ముఖం నల్లగా మారిపోయిందా.‌. 15 నిమిషాల్లో ఈజీగా రిపేర్ చేసుకోండిలా!

వేసవికాలం ప్రారంభమ‌వుతోంది.ఎండలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి.

 Repair Sunburn Skin With This Home Remedy-TeluguStop.com

ఈ సమ్మర్ సీజన్ లో ఆరోగ్యం మరియు చర్మం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే అటు హెల్త్ ఇటు స్కిన్ రెండు డ్యామేజ్ అవుతాయి.

ముఖ్యంగా ఈ ఎండల్లో అరగంట తిరిగారంటే చాలు ముఖం నల్లగా ( Black face )కాంతిహీనంగా మారిపోతుంది.అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక తెగ హైరానా పడిపోతుంటారు.

కానీ టెన్షన్ వద్దు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని పాటించారంటే కేవలం 15 నిమిషాల్లో ఎండల దెబ్బకు నల్లగా మారిన ముఖ చర్మాన్ని రిపేర్ చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు అన్నం గంజిని( Rice porridge ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon juice ), రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్ ( Orange Peel Powder ) మరియు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Telugu Tips, Skin, Remedy, Latest, Repairsunburn, Skin Care, Skin Care Tips, Sun

ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.గంజి, నిమ్మరసం, ఆరెంజ్ పీల్‌ పౌడర్ మరియు పసుపులో ఉండే పలు సుగుణాలు నల్లగా మారిన చర్మాన్ని రిపేర్ చేస్తాయి.టాన్ ను రిమూవ్ చేస్తాయి.

స్కిన్ ను నిమిషాల్లోనే వైట్ గా, బ్రైట్ గా మారుస్తాయి.అలాగే ఈ రెమెడీని తరచూ పాటించడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది.

Telugu Tips, Skin, Remedy, Latest, Repairsunburn, Skin Care, Skin Care Tips, Sun

పైగా ఆరెంజ్ పీల్ పౌడ‌ర్ లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది.ఇది చర్మాన్ని కాంతివంతంగా మరియు ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది.ఆరెంజ్ పీల్ పౌడర్ లో ఉండే బ్లీచింగ్ ప్రభావం చ‌ర్మంపై ఏర్పడే పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ను మాయం చేయ‌డంలో సహాయపడుతుంది.మ‌రియు చ‌ర్మంపై అధిక ఆయిల్ ఉత్ప‌త్తిని సైతం త‌గ్గిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube